Minister Nara Lokesh: అవమానాలను ఆయుధంగా మార్చుకోండి.. లక్ష్యం దృష్టిలో పెట్టుకుంటే విజయం ఖాయం: లోకేశ్

లక్ష్యం దృష్టిలో పెట్టుకుంటే విజయం ఖాయం: లోకేశ్

Update: 2025-11-24 11:47 GMT

Minister Nara Lokesh: ప్రవచనకర్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు రూపొందించిన పుస్తకాలను విద్యార్థుల భవిష్యత్తు కోసం అందిస్తున్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘విలువల విద్య’ సదస్సులో చాగంటితో కలిసి లోకేశ్ పాల్గొన్నారు. పిల్లలను సరైన మార్గంలో ఆదర్శప్రాయంగా పెంచాల్సిన బాధ్యత ప్రధానంగా ఉపాధ్యాయులపై ఉందని ఆయన స్పష్టం చేశారు.

‘‘పిల్లల్లో మార్పు ఇంటి నుంచే మొదలవ్వాలి. మహిళలను గౌరవించినప్పుడే సమాజం బాగుంటుంది. సినిమాల్లోనే కాకుండా వెబ్‌సిరీస్‌ల్లోనూ మహిళలను అగౌరవంగా చూపించకూడదు. మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్యలు సరికాదు. జీవితంలో అవమానాలు సహజం. లక్ష్యంతో పని చేస్తే విజయం సాధించగలం. టీచర్ల సమస్యలను చాలా వరకు పరిష్కరించాం. విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తున్నాం’’ అని లోకేశ్‌ అన్నారు.

ఈ సందర్భంగా విద్యా విభాగంలో జరుగుతున్న సంస్కరణలు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారాలపై ఆయన వివరించారు. విద్యార్థుల్లో విలువలు అలవాటు చేసుకోవడం ద్వారా మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు.

Tags:    

Similar News