CM Chandrababu Naidu: ప్రభుత్వ ఉద్యోగుల్లో సామర్థ్యాలు పెంచడం, పరిపాలనా నైపుణ్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ‘మిషన్ కర్మయోగి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

మంగళవారం విజయవాడలోని అంబేడ్కర్ కళావేదికలో జరిగిన ‘మిషన్ కర్మయోగి’ ప్రాంతీయ సదస్సులో సీఎం పాల్గొని, దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వర్క్‌షాప్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

ప్రభుత్వ శిక్షణ సంస్థల సామర్థ్య నిర్మాణం, ఉద్యోగుల నైపుణ్యాల పెంపు అంశాలపై సదస్సులో చర్చలు జరిగాయి. ‘ఉన్నతి’ కార్యక్రమం ద్వారా సామర్థ్యాల పెంపు కోసం ఐజీఓటి, ‘మిషన్ కర్మయోగి’ క్వాలిటీ ఫ్రేమ్‌వర్క్ భాగస్వామ్యంతో ముసాయిదా రూపకల్పన చేశారు. వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై ప్రజెంటేషన్లు ఇచ్చారు.

ప్రభుత్వ శిక్షణ సంస్థలు కేవలం కోర్సులు నిర్వహించే కేంద్రాలుగా కాకుండా, ఆయా శాఖల పనితీరును మెరుగుపరిచేలా సన్నద్ధం కావాలని కార్యాచరణ రూపొందించారు. ఈ కార్యక్రమం అనంతరం నెల్లూరు జిల్లా ఉదయగిరికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు.

Tags: