Chief Minister Nara Chandrababu Naidu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంది. మనవడు దేవాన్ష్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని శ్రీవారి సేవలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఆలయ మహాద్వారం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో, అర్చకులు ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనాలు చెప్పి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఆ తర్వాత వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో చంద్రబాబు కుటుంబం స్వయంగా భక్తులకు అన్నం వడ్డించింది. దేవాన్ష్‌ పేరుతో ఒక్క రోజు అన్నదాన వితరణకు రూ.44 లక్షల విరాళం అందజేశారు.

వెంగమాంబ సత్రం నుంచి పద్మావతి వసతిగృహానికి వెళ్తుండగా సీఎం మధ్యలో ఆగారు. లేపాక్షి కూడలిలో భక్తులతో మాట్లాడారు. ఓ చిన్నారిని ఎత్తుకుని ముద్దాడారు. భక్తుల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు.

అనంతరం తిరుమలలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి భక్తి భావంతో శ్రీవారి సేవలో పాల్గొన్న చంద్రబాబు.. భక్తులకు సేవ చేయడం ద్వారా ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారని తెలుస్తోంది.

Tags: