N. Chandrababu Naidu: చంద్రబాబుతో జీఆర్‌ఎంబీ ఛైర్మన్ దోర్జే గ్యాంబా భేటీ
జీఆర్‌ఎంబీ ఛైర్మన్ దోర్జే గ్యాంబా భేటీ
పెద్దవాగు ప్రాజెక్టు బలోపేతం చేయడానికి తెలంగాణతో కలిసి పని చేస్తాం
N. Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (జీఆర్‌ఎంబీ) ఛైర్మన్ దోర్జే గ్యాంబా ఆదివారం భేటీ అయ్యారు. ఉండవల్లి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఏపీ-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని పెద్దవాగు ప్రాజెక్టు అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, పెద్దవాగు ప్రాజెక్టు కట్టను బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని దోర్జే గ్యాంబాకు వివరించారు. రాష్ట్రంలో చేపట్టిన వివిధ జల సంరక్షణ చర్యలు, సమర్థవంతమైన నీటి నిర్వహణ వ్యవస్థల గురించి కూడా ఆయనకు తెలియజేశారు.
అవేర్ సంస్థ ద్వారా జలవనరుల సమాచారాన్ని రియల్ టైమ్‌లో నమోదు చేస్తున్నామని, నదుల అనుసంధానం, వరద జలాల సద్వినియోగం వంటి అంశాలపై వివరంగా చర్చించారు. రాష్ట్ర జలవనరుల సమర్థ నిర్వహణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను గ్యాంబా సానుకూలంగా స్వీకరించినట్లు తెలుస్తోంది.
ఈ భేటీలో ఇరు వైపులా నీటి నిర్వహణ, సరిహద్దు ప్రాజెక్టుల సమన్వయం పై దృష్టి సారించారు. ఈ సమావేశం రాష్ట్ర జల సంరక్షణ ప్రయత్నాలకు మరింత బలం చేకూర్చుతుందని భావిస్తున్నారు.