Nara Lokesh: బస్సు ప్రయాణికుల భద్రతకు చొరవ.. ఆర్టీఏ అధికారిని అభినందించిన మంత్రి లోకేశ్

ఆర్టీఏ అధికారిని అభినందించిన మంత్రి లోకేశ్

Update: 2026-04-07 15:29 GMT

Nara Lokesh: ట్రావెల్స్ బస్సుల్లో ఇటీవల తరచూ అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్న నేపథ్యంలో ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు రవాణా శాఖ అధికారి ఒకరు ప్రత్యేక చొరవ చేపట్టారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ సిద్దీఖ్ ఒక ట్రావెల్స్ బస్సును ఆపి ప్రయాణికులతో నేరుగా మాట్లాడారు.

అగ్ని ప్రమాదం జరిగినప్పుడు విలువైన వస్తువుల కోసం సమయం వృథా చేయొద్దని, వెంటనే బస్సు నుంచి దిగిపోవాలని సూచించారు. అత్యవసర ద్వారం ఎక్కడ ఉందో ముందుగానే తెలుసుకోవాలని కూడా ప్రయాణికులకు సలహా ఇచ్చారు.

ఈ వీడియోను ఏపీ మంత్రి నారా లోకేశ్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పంచుకున్నారు. ప్రయాణికుల భద్రతపై ఆర్టీఏ అధికారి సిద్దీఖ్ చూపిన ఈ చొరవ అనేక మంది ప్రాణాలను కాపాడుతుందని మంత్రి లోకేశ్ ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాలని, ఈ వీడియోను స్నేహితులు, కుటుంబ సభ్యులతో తప్పకుండా పంచుకోవాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు.

ఈ చర్యలు రాష్ట్రవ్యాప్తంగా ట్రావెల్స్ బస్సు ప్రయాణికుల్లో భద్రతా స్పృహను పెంచడంలో ఉపయోగపడతాయని అందరూ భావిస్తున్నారు.

Tags:    

Similar News