Nara Lokesh: అమరావతి గ్రహణం తొలగిపోయింది.. దీపాలు వెలిగించి సెల్ఫీలు పెట్టండి: మంత్రి నారా లోకేశ్‌

దీపాలు వెలిగించి సెల్ఫీలు పెట్టండి: మంత్రి నారా లోకేశ్‌

Update: 2026-04-02 13:20 GMT

Nara Lokesh: రాజధాని అమరావతికి పట్టిన గ్రహణం పూర్తిగా వీడిపోయిందని మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు. ప్రజారాజధాని అమరావతికి చట్టబద్ధత లభించిందని, ఇక అన్ని అనుమానాలు తొలగిపోయాయని స్పష్టం చేశారు.

ఈ ఐతిహాసిక ఆనంద సందర్భంలో నేటి సాయంత్రం 7 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగించి ‘మన రాజధాని అమరావతి’కి దీపహారతులు ఇవ్వాలని లోకేశ్‌ ప్రజలకు స్వయంగా పిలుపునిచ్చారు. వెలిగించిన దీపాలతో సెల్ఫీలు తీసుకుని, ఆ ఫోటోలను #APThanksIndia హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని కోరారు.

ఈ మేరకు ఆయన తన ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్టు చేశారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించడంలో సహకరించిన అన్ని పార్టీలు, నేతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమం ద్వారా అమరావతి అభివృద్ధి కోసం ప్రజల ఐక్యతను మరోసారి ప్రపంచానికి చాటాలని లోకేశ్‌ ఆకాంక్షించారు.

Tags:    

Similar News