TADIPATRI : పార్టీ కార్యక్రమం చేయాలి… తాడిపత్రి వెళ్లడానికి అనుమతివ్వండి

అనంతపురం ఎస్పీ జగదీష్‌ కి లేఖ రాసిన పెద్దారెడ్డి;

Update: 2025-07-05 08:23 GMT

తమ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు తన నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నందున తనకు తాడిపత్రి వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలని జిల్లా ఎసపీ జగదీష్‌ కు మరోసారి మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి లేఖ రాశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌.జగన్మోహనరెడ్డి నిర్దేశించిన దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మేనిఫెస్టో కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా తాడిపత్రి నియోజవకర్గ ఇంఛార్జ్‌గా తాను కూడా తన నియోజకవర్గంలో రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మ్యానిఫెస్టో కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉందని పెద్దారెడ్డి ఎస్పీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమం నిర్వహించడానికి తాను తాడిపత్రి రావాలసి ఉందని అందుకు అనుమతి ఇవ్వాలని పెద్దారెడ్డి జిల్లా ఎస్పీని లేఖలో కోరారు. దీంతో ఎస్పీ జగదీష్‌ వైఎస్‌ఆర్‌సీపీ నేత తాడిపత్రి వెళ్ళేందుకు అనుమతి ఇస్తారా లేతా అనే అంశం జిల్లా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అయితే మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు ఏప్రిల్‌ 30వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అనుతి ఇస్తే ఆదేశాలు జారీ చేసింది. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్ళినప్పుడు ఆయనకు అవసరమైన భద్రత కల్పించాలని కోర్టు పోలీసులకు సూచించింది. కానీ అనంతపురం పోలీసులు మాత్రం తాము భద్రత కల్పించలేమని చేతులెత్తేశారు. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లడానికి ఎప్పుడైనా ప్రయత్నిస్తే ఆయన్ను అరెస్ట్‌ చేసి తాడిపత్రి వెలుపలకి తీసుకుపోయేవారు. ఈ మధ్య పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన నివాశానికి వెళ్ళిన సందర్భంలో పోలీసులు వచ్చి ఆయన్ను అరెస్ట్‌ చేసి తాడిపత్రిలో ఉండటానికి వీలు లేదని ఆంక్షలు విధించారు. తాజాగా పార్టీ కార్యక్రమం నిర్వహించడానికి తాను తాడిపత్రి వెళ్లాలని పెద్దారెడ్డి రాసిన లేఖపై ఎస్పీ ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News