AP Deputy Chief Minister Pawan Kalyan: బైకర్ తాప్సీ ఉపాధ్యాయకి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందనలు

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందనలు

Update: 2026-03-27 10:40 GMT

AP Deputy Chief Minister Pawan Kalyan: ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనే లక్ష్యంతో, దేశవ్యాప్తంగా ఊబకాయం (ఒబెసిటీ) సమస్యను తగ్గించేందుకు అవగాహన కల్పించడానికి ద్విచక్రవాహనంపై యాత్ర చేపట్టిన ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌కు చెందిన తాప్సీ ఉపాధ్యాయురాలిని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందించారు.

‘మిషన్ హెల్దీ భారత్ - ఒబిసిటీ ముక్త్ భారత్’ అనే పేరుతో ఈ యాత్రను ప్రారంభించిన తాప్సీ, మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాప్సీ తన యాత్ర వివరాలు తెలిపారు. గత ఏడాది మార్చి 9న మేరఠ్ నుంచి ప్రారంభమైన ఈ బైక్ యాత్రలో ఇప్పటివరకు 16 రాష్ట్రాలు చుట్టి 17,400 కిలోమీటర్లు ప్రయాణించినట్లు తెలిపారు.

తాప్సీ ఉపాధ్యాయురాలిని సత్కరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, యువతకు స్ఫూర్తిగా నిలవాలని, యాత్ర పూర్తి విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

ఈ యాత్రలో భాగంగా తాప్సీ రాష్ట్ర సచివాలయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. యువత, ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించేందుకు ఈ యాత్ర నిర్వహిస్తున్న తాప్సీని మంత్రి అభినందించి, సత్కరించారు.

ఈ యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ఊబకాయం సమస్యపై ప్రజల్లో అవగాహన పెంచడం లక్ష్యంగా తాప్సీ ఉపాధ్యాయురాలు కృషి చేస్తున్నారు. ఆమె ప్రయాణం యువతీయువకులకు మంచి స్ఫూర్తినిస్తోంది.

Tags:    

Similar News