Pawan Kalyan Keeps His Word: మాట తప్పని పవన్.. వృద్ధురాలి ఇంట ముచ్చటగా మూడోసారి పర్యటన

వృద్ధురాలి ఇంట ముచ్చటగా మూడోసారి పర్యటన

Update: 2025-12-24 06:05 GMT

Pawan Kalyan Keeps His Word: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు మరోసారి ఇప్పటం గ్రామాన్ని సందర్శించారు. వైసీపీ పాలనలో రోడ్డు విస్తరణ పేరుతో జనసేన మద్దతుదారుల ఇళ్లను కూల్చివేసిన సంఘటన తర్వాత.. అప్పటి జనసేన అధినేతగా పవన్ బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఎన్నికల అనంతరం మళ్లీ వచ్చి కలుస్తానని వృద్ధురాలు ఇండ్ల నాగేశ్వరమ్మ కోరిక మేరకు ఈ పర్యటన జరిగింది.

బుధవారం ఉదయం ఇప్పటం చేరుకున్న పవన్ కల్యాణ్.. నేరుగా నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లారు. ఆమె ఆప్యాయంగా స్వాగతం పలికారు. పవన్ ఆమెను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని, క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్నారు. వృద్ధురాలికి రూ.50 వేలు, ఆమె మనవడు చదువుకు రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. నాగేశ్వరమ్మ కుటుంబ సభ్యులతో కుశల ప్రశ్నలు చేస్తూ కొంతసేపు గడిపారు.

ఈ పర్యటన ద్వారా బాధిత కుటుంబాలకు మద్దతు ప్రకటిస్తూనే.. రాజకీయ కక్షలకు బలైన వారికి న్యాయం చేసేందుకు కట్టుబడి ఉన్నట్టు పవన్ కల్యాణ్ తన చర్యలతో నిరూపించారు. గ్రామస్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

Tags:    

Similar News