Pawan Lays Foundation Stone: పవన్ శంకుస్థాపన: శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణకు రూ.20.77 కోట్లతో శ్రీకారం
శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణకు రూ.20.77 కోట్లతో శ్రీకారం
Pawan Lays Foundation Stone: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని కొబ్బరి రైతుల ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనగా, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా వర్చువల్‌గా హాజరయ్యారు.
రూ.20.77 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా కోనసీమ ప్రాంత కొబ్బరి రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చినట్లయింది. ఇటీవల రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ 45 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని ప్రకటించగా, కేవలం 35 రోజుల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమన్వయంతో ఈ పనులకు శ్రీకారం చుట్టడం గమనార్హం. జనసేన పార్టీ ఈ విషయంపై సంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ ఆధునికీకరణ పనులు పూర్తయితే ప్రాంతంలో నీటి నిల్వ సమస్యలు తొలగి, వ్యవసాయ రంగం బాగు పడనుంది. ప్రభుత్వం రైతుల సంక్షేమంపై చూపుతున్న శ్రద్ధకు ఇది నిదర్శనమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.