Minister Lokesh in Ongole: ప్రకాశం: ఒంగోలులో మంత్రి లోకేష్‌కు ఘనస్వాగతం పలికిన టీడీపీ కార్యకర్తలు

లోకేష్‌కు ఘనస్వాగతం పలికిన టీడీపీ కార్యకర్తలు

Update: 2025-11-06 09:12 GMT

Minister Lokesh in Ongole: ప్రకాశం జిల్లా ఒంగోలులో మంత్రి నారా లోకేష్‌కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. టంగుటూరు టోల్‌గేట్ వద్ద ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆయనను ఉత్సాహంగా ఆహ్వానించారు. కందుకూరు నియోజకవర్గం తెట్టు వద్ద ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వర రావు నేతృత్వంలో స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి మంత్రి లోకేష్‌కు స్వాగతం తెలిపారు.

ఈ సందర్భంగా భారీ గజమాలలతో ఎమ్మెల్యే నాగేశ్వర రావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రి లోకేష్‌కు స్వాగతం పలికారు. పార్టీ జెండాలు ఊరేగించి, పుష్పగుచ్ఛాలు అందజేస్తూ, 'జై తెలుగుదేశం' నినాదాలు చేస్తూ ఆ ప్రాంతం మారుమ్రోగిపోయింది. స్థానిక ప్రజలు, కార్యకర్తల నుంచి వచ్చిన అర్జీలు, పిటిషన్‌లను మంత్రి లోకేష్ స్వీకరించారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి, ఫోటోలు దిగుతూ ముందుకు సాగారు.

మరికాసేపట్లో నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగ్గర రాష్ట్ర ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ దివంగత మాలేపాటి సుబ్బానాయుడు నివాసానికి మంత్రి లోకేష్ చేరుకుంటారు. ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతి తెలిపనున్నారు. ఈ స్వాగత కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు ఉత్సాహంగా తరలివచ్చి, పార్టీ బలాన్ని ప్రదర్శించారు

Tags:    

Similar News