PM Modi at Sathya Sai Shata Jayanti Celebrations: పుట్టపర్తి పవిత్ర భూమి... ఇక్కడ ఏదో అపూర్వ శక్తి ఉంది: సత్యసాయి శతజయంతి వేడుకల్లో ప్రధాని మోదీ

ఇక్కడ ఏదో అపూర్వ శక్తి ఉంది: సత్యసాయి శతజయంతి వేడుకల్లో ప్రధాని మోదీ

Update: 2025-11-19 09:05 GMT

PM Modi at Sathya Sai Shata Jayanti Celebrations: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడం తనకు గొప్ప అదృష్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో జరిగిన శతజయంతి మహోత్సవాలకు హాజరైన ఆయన ప్రసంగిస్తూ... సత్యసాయి బోధనలు, సేవలు దేశవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాలను మార్చాయని కొనియాడారు.

“విశ్వమానవ ప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారు. భౌతికంగా బాబా మన మధ్య లేకపోయినా... ఆయన ప్రేమ, ఆశీస్సులు ఎప్పటికీ మనతోనే ఉంటాయి. ‘అందరినీ ప్రేమించు... అందరికీ సేవ చెయ్యి’ అనే ఆయన నినాదం లక్షలాది మందిని సేవా మార్గంలో నడిపించింది. తాగునీరు, వైద్యం, విద్యా రంగాల్లో బాబా సంస్థలు చేపట్టిన సేవలు అపూర్వమైనవి. పుట్టపర్తి ఈ పవిత్ర భూమిలో ఏదో మహత్తర శక్తి ఉంది. ఇలాంటి స్థలాలు మనకు ఆధ్యాత్మిక శక్తిని, ప్రశాంతతను ఇస్తాయి” అని మోదీ ఉద్వేగంగా పేర్కొన్నారు.

సత్యసాయి జీవితం, సేవలు, బోధనల స్మారకంగా రూ.100 విలువైన ప్రత్యేక నాణెం, నాలుగు తపాలా బిళ్లలను ప్రధాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

ఉదయం ప్రశాంతి నిలయంలోని సత్యసాయి మహాసమాధిని ప్రధాని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాలు సత్యసాయి సందేశాన్ని మరింత వ్యాప్తి చేస్తాయని ఆయన ఆకాంక్షించారు.

Tags:    

Similar News