Macharla Turaka Kishore : వైసీపీ నేత తురకా కిషోర్‌ని తక్షణం విడుదల చేయండి

రెంట చింతల పోలీసులను ఆదేశించిన ఏపీ హైకోర్ట్‌;

Update: 2025-08-07 11:34 GMT

మాచర్ల మాజీ మున్సిపల్‌ చైర్మన్‌, వైఎస్‌ఆర్‌సీపీ నేత తురకా కిషోర్‌ని వెంటనే విడుదల చేయాలని ఏపీ హైకోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది. కిషోర్‌ రిమాండ్‌ రిపోర్టును అంగీకరించేది లేదని దాన్ని హైకోర్టు సస్పెండ్‌ చేసింది. గత వారం గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన తన భర్తను పల్నాడు జిల్లా రెంటచింతల పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేశారని, ఆన్ను వెంటనే కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని తురకా కిషోర్‌ భార్య సురేఖ హైకోర్టులో లంచ్‌ మోషన్‌లో హెబియస్‌ కార్పస్‌ పిటీషన్‌ దాఖలు చేసింది. సురేఖ పిటీషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు కిషోర్‌ను అరెస్ట్‌ చేసిన విధానంపై తీవ్రంగా స్పందించింది. అరెస్ట్‌ చేసే సమయంలో పాటించాల్సిన కనీస నిబంధనలను పాటించలేదని, సుప్రీంకోర్టు గైడ్‌ లైన్స్‌ను కూడా పాటించలేదని హైకోర్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కిషోర్‌ని వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News