వెన్నుపోటు దినం పోస్టర్ విడుదల చేసిన సజ్జల

Update: 2025-05-30 10:21 GMT

చంద్రబాబు హయాంలోని కూటమి ప్రభుత్వంలో అరాచక, మోసపూరిత పాలన సాగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంగా నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. ఈ నేపధ్యంలో వెన్నుపోటు దినం పోస్టర్ ని సజ్జల తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూచంద్రబాబు నాయుడు ప్రజలని భ్రమల్లో పెట్టి పాలన చేస్తున్నారని మండిపడ్డారు. గడచిన సంవత్సర కాలంలో తమ అరాచకాలతో రాష్ట్రంలో భయోత్పాతం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ తొలి ఏడాదే 99% హామీలు అమలు చేస్తే చంద్రబాబు సంవత్సరం దాటినా ఒక్కటీ చెయ్యలేదన్నారు. చంద్రబాబు ఏ ఒక్క హామీ అమలు చేయరని జగన్ ఆనాడే చెప్పారని సజ్జల గుర్తు చేశారు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఇక ఏ పథకాన్నీ అమలు చేయరని తేలిపోయిందన్నారు. పైగా తాను హామీలను అమలు చేయలేనని బరితెగించి మాట్లాడటం చెంద్రబాబుకే చెల్లిందన్నారు. జగన్మోహనరెడ్డి తీసుకువచ్చిన సంస్కరణలను, వ్వస్ధలను చంద్రబాబు సర్వనాశనం చేశారని విమర్శించారు. చంద్రబాబు అబద్దపు హామీలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచారని అందుకే కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఆ రోజు జిల్లా కలెక్టర్లకు, అధికారులకు వినతిపత్రాలను సమర్పిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు, మాజీ మంత్తులు అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్, సాకే శైలజానాథ్, మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు, కుంభా రవిబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News