Local Elections: స్థానిక ఎన్నికల్లో కేంద్ర బలగాల మోహరింపునకు వైకాపా పిటిషన్.. హైకోర్టులో చుక్కెదురు
హైకోర్టులో చుక్కెదురు
Local Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతిభద్రతల కోసం కేంద్ర (పారామిలిటరీ) బలగాలను కేటాయించాలని వైకాపా వేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. దీంతో వైకాపాకు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది.
స్థానిక ఎన్నికల్లో పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాల భద్రత ఉంచేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని వైకాపా కోరింది. ఈ మేరకు వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగిల్ జడ్జి వద్ద పిటిషన్ దాఖలు చేశారు. అయితే సింగిల్ జడ్జి బెంచ్ ఈ నెల 16న పిటిషన్‌ను కొట్టివేసింది.
పశ్చిమ బెంగాల్ పరిస్థితులను ఏపీతో పోల్చి చూడలేమని, రాష్ట్రంలో పారామిలిటరీ బలగాల అవసరం లేదని ప్రభుత్వం వాదించింది. హైకోర్టు కూడా ఈ వాదనను అంగీకరించింది.
సింగిల్ జడ్జి తీర్పుపై వైకాపా డివిజన్ బెంచ్‌కు అప్పీలు చేసింది. వెకేషన్ బెంచ్ ముందు వాదనలు విన్న తర్వాత డివిజన్ బెంచ్ కూడా పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. దీంతో స్థానిక ఎన్నికలకు కేంద్ర బలగాలు కావాలన్న వైకాపా ప్రయత్నం విఫలమైంది.