Ysjagan NCLT : సీబీఐ, ఈడీ విచారణలో ఉండగా షేర్ల బదలాయింపు కుదరదు

సరస్వతీ పవర్‌ ఇండస్ట్రీస్‌ కేసులో ఎన్‌సీఎల్‌టీ సంచలన తీర్పు;

Update: 2025-07-29 08:46 GMT

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌.జగన్మోహనరెడ్డికి నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)లో భారీ ఉపశమనం లభించింది. సరస్వతీ పవర్‌ ఇండస్ట్రీస్‌ షేర్లను వైఎస్‌.జగన్‌ సోదరి వైఎస్‌షర్మిల పేరు మీద బలదలాయింపు నిలుపుదల చేస్తూ ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్‌ ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. తన కుటుంబ సభ్యులు సరస్వతీ పవర్‌ ఇండస్ట్రీస్‌ నుంచి అక్రమంగా షేర్లు బదిలీ చేసుకున్నారని, అందువల్ల షేర్ల బదిలీ ప్రక్రియ నిలుపుదల చేయాలని కోరుతూ వైఎస్‌జగన్‌ గత ఏడాది ఎన్‌సీఎల్‌టీలో పిటీషన్‌ వేశారు. తన స్వఅర్జితమైన కంపెనీల్లో నా సోదరికి 40 శాతం వాటా ఇవ్వాలని భావించి గిఫ్ట్‌ డీడ్‌ చేసినట్లు. అయితే ఆయా కంపెనీలు ఈడీ అటాచ్‌మెంట్‌ లో ఉన్నందున కేసు పూర్తయిన తరువాత షేర్ల బదిలీ ప్రక్రియ పూర్తి చేస్తానని చెప్పినా నా సోదరి అక్రమంగా తన పేరున సరస్వతీ పవర్‌ ఇండస్ట్రీస్‌ షేర్లను బదలాయించుకున్నారని, గిఫ్ట్‌ ప్రక్రియ పూర్తి కాకుండానే ఈ విధంగా షేర్ల బదలాయింపు చేసుకున్నారని జగన్‌ ఎన్‌సీఎల్‌టీలో వేసిన పిటీషన్లో పేర్కొన్నారు. షేర్ల పత్రాలు, వాటాల బదలాయింపు ఫారాలు నేను సమర్పిస్తేనే బదలాయింపు జరగాల్సి ఉంటుందని, కానీ అందుకు విరుద్దంగా కంపెనీ వాలను తన పేరు మీద బదిలీ చేసుకున్నారని జగన్‌ తన పిషన్లో తెలిపారు. తన అనుమతి లేకుండా జరిగిన బదలాయింపు ప్రక్రయను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని జగన్మోహనరెడ్డి ఎన్‌సీఎల్‌టీని కోరారు. అదే సమయంలో ఈ వ్యవహారం ఎన్సీఎల్టీ పరిధిలోకి రాదని అందవల్ల వైఎస్‌.జగన్‌ వేసిన పిటీషన్ను కొట్టివేయాలని వైఎస్‌.షర్మిల, వైఎస్‌.విజయమ్మలు కూడా ఎన్‌సీఎల్‌టీలో పిటీషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ పిటీషన్‌ పై పది నెలల పాటు విచారణ జరిపిన ఎన్‌సీఎల్‌టీ జ్యుడిషియల్‌ సభ్యులు రాజీవ్‌ భరద్వాజ్‌, టెక్నికల్‌ మెంబర్‌ సంజయ్‌ పురిలు విచారణ జరిపి తీర్పును రిజర్వ్‌ చేశారు. తాజాగా జగన్‌ తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన ట్రిబ్యునల్‌ కేంద్ర విచారణ సంస్ధల విచారణలో ఉండగా ఆస్తులు, షేర్ల బదలాయింపు సాధ్యం కాదంటూ మంగళవారం తీర్పు వెలవరించింది.

Tags:    

Similar News