Andhrapradesh : ఆగష్టు 15 నుంచి ఎపి సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం

కార్యదర్శులతో సిఎస్ కె.విజయానంద్ సమీక్ష;

Update: 2025-08-12 11:33 GMT
  • సే నో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నినాదంతో ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు
  • 2026 జూన్ 5 నాటికి ఎపిని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేయడమే లక్ష్యం

ఎపిని వచ్చే ఏడాది జూన్ 5 నాటికి ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. దానిలో భాగంగా ఈనెల 15వ తేదీన నుండి ఎపి సచివాలయంలో సే నో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నినాదంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నట్లు సీయస్ ప్రకటించారు. విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి మరీ ముఖ్యంగా మానవాళికి కలుగుతున్న నష్టం వర్ణణాతీతం.ఈనేపధ్యంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన రాష్ట్ర సచివాలయం నుండే ముందుగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ద్వారా రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచేందుకు శ్రీకారం చుట్టనున్నారు.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశమై చర్చిస్తున్నారు. ఆగష్టు 15 నుండి ఎపి సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన కార్యదర్శులతో సమీక్షిస్తున్నారు.ముఖ్యంగా పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఒకసారి వాడి పడేసే(Single Use Plastic) వివిధ క్యారీ బ్యాగులు,ప్లాస్టిక్ మంచినీటి సీసాలు,గ్లాసులు, ప్లేట్లు,కప్పులు,స్పూన్లు,పోర్కులు,ఫినాయిల్ సీసాలు, డబ్బాలు తదితర వస్తువులను పూర్తిగా నిషేధించే ఇందుకు తీసుకోవాల్సిన అంశాలపై సిఎస్ విజయానంద్ చర్చిస్తున్నారు. ఈసమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ రావత్,ఎంఏయుడి ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్, పిసిబి చైర్మన్ కృష్ణయ్య, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండి అనిల్ కుమార్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు‌. అలాగే ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఆర్పి సిసోడియా, కృష్ణబాబు, సిసిఎల్ఏ జయలక్ష్మి, జిఏడి ముఖ్య కార్యదర్శి ఎంకె మీనా, సిఆర్డిడిఏ కమీషనర్ కె.కన్నబాబు, ముఖ్య కార్యదర్శి సునీత, కార్యదర్శులు తదితరులు వర్చువల్ గా పాల్గొన్నారు.

Tags:    

Similar News