SIT Raids YSRCP MP Mithun Reddy’s Houses: వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి ఇళ్లపై సిట్ దాడులు, విస్తృత తనిఖీలు
ఇళ్లపై సిట్ దాడులు, విస్తృత తనిఖీలు
By : PolitEnt Media
Update: 2025-10-14 10:34 GMT
SIT Raids YSRCP MP Mithun Reddy’s Houses:ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ఇళ్లలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాల్లోని ఆయన నివాసాలపై దృష్టి సారించిన సిట్ బృందం తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని ప్రశాంత్‌నగర్, యూసుఫ్‌గూడలోని గాయత్రీహిల్స్‌లో ఉన్న మిథున్‌రెడ్డి ఇళ్లలో సోదాలు జరిగాయి. అలాగే కొండాపూర్‌లోని ఆయన కార్యాలయంలో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు విచారణలో భాగంగా ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం.