కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

Update: 2025-05-24 11:10 GMT

నైరుతి రూతుపవనాలు శనివారం కేరళలో ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాలు సాధారణ తేదీ కంటే ఎనిమిది రోజుల ముందే కేరళలో ప్రవేశించాయి. రుతు పవనాల ప్రభావంతో శనివారం మధ్యాహ్నం నుంచి కేరళ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసాయి. మరో రెండు మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి కూడా రుతుపవనాలు ప్రవేశించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈవిధంగా రుతుపవనాలు గడువు కన్నా ముందుగా 2009లో వచ్చాయి. ఆ తరువాత కాలంలో ఈ 16 సంత్సరాల కాలంలో రుతుపవనాల రాక జూన్ మొదటి వారంలోనే జరిగేది. ఈవిధంగా రుతుపవనాలు జూన్ మాసం కన్నా ముందుగా 2009వ సంవత్సరలో వచ్చాయి. 2009 మే 23వ తేదీన రుతుపవనాలు కేరళలో ప్రవేశించాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Tags:    

Similar News