Ap Cabinet Meet : విశాఖ, విజయవాడ మెట్రో కు రేపు టెండర్లు
ఏపీ క్యాబినేట్ సమావేశంలో నిర్ణయం;
విశాఖపట్నం, విజయవాడల్లో మెట్రో రైలు నిర్మాణానికి రేపు టెండర్లు పిలవాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఏపీ సచివాలయంలో సీయం చంద్రబాబునాయుడి అధ్యక్షతన గురువారం మంత్రివర్గం భేటీ అయ్యాంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులో 40 శాతం పనులకు రేపు టెండర్లు వేయడానికి క్యాబినేట్ ఆమోద ముద్ర వేసింది. రూ. 11,498 కోట్ల అంచనాతో వైజాగ్ మెట్రో, రూ.10,118 కోట్ల అంచనాతో విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50-50 భాగస్వామ్యంతో నిర్మాణం చేయాలని నిర్ణయం. విశాఖ మెట్రో రైలు నిర్మాణానికి వీఎంఆర్డీ నుంచిరాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.4,101 కోట్ల నిధులు ఇవ్వాలని క్యాబినేట్ నిర్ణయం. అలాగే విజయవాడ మెట్రో కు సిఆర్డీఏ నుంచి రూ. 3,497 కోట్లు రాష్ట్ర ప్రభుత్వo వాటాగా నిధులు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. నాలా చట్ట సవరణ, ఎల్‌ఆర్‌ఎస్‌పై కూడా క్యాబినెట్ లో చర్చ జరిగింది. నాలా చట్ట సవరణ ప్రతిపాదనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభ్యంతరం తెలిపడంతో వచ్చే క్యాబినేట్ లో చర్చద్దామని ప్రతిపాన వాయిదా వేశారు. ఇక బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ విషయంలో కూడా నాదెండ్ల మనోహర్ అభ్యంతరం తెలపడంతో ఆ ప్రతిపాదనను కూడా వాయిదా వేశారు. ఈనెల 26వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి బృందం సింగపూర్ పర్యటనపై కూడా మంత్రిమండలి సమావేశంలో చర్చ జరిగింది. ఈ టూర్ పై చంద్రబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సింగపూర్ పై దష్ప్రచారం చేశారని, సింగపూర్ మంత్రులపై కూడా దుష్ప్రచారం చేశారని అన్నారు. మళ్ళీ సింగపూర్‌తో సంబంధాలు పునరుద్దరణ కోసం ఈ పర్యటన ఉపయోగపడుతుందని, అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యం అవుతుందని సీయం చంద్రబాబు క్యాబినేట్ సహచరులకు వివరించారు.