Women Empowerment : జాతీయ మహిళా సాధికార సదస్సును విజయవంతం చేయాలి

సదస్సు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు;

Update: 2025-07-24 04:01 GMT

సెప్టెంబర్ 14, 15 వ తేదీలలో తిరుపతి జిల్లాలో జరిగే జాతీయ మహిళా సాధికారిత కు సంభందించిన కాన్ఫరెన్స్ ను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు.బుదవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు , రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు సత్యప్రసాద్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ సూర్యదేవర, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఓ ఎస్ డి, పెట్టన్న చౌదరి, టిటిడి చైర్మన్ బి.ఆర్.నాయుడు, టిటిడి ఈ.ఓ. శ్యామల రావు, జిల్లా కలెక్టర్ డా.వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి నగరపాలక కమీషనర్ ఎన్.మౌర్య లతో కలసి సెప్టెంబర్ 14, 15 తేదీలలో తిరుపతి నందు జరిగే జాతీయ మహిళా సాధికారత సదస్సు నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ మాట్లాడుతూ దేశం మొత్తం మీద 31 అసెంబ్లీలు ఉన్నాయి ప్రతి అసెంబ్లీలో కూడా వివిధ రకాల కమిటీలు ఉంటాయన్నారు. పార్లమెంటు స్పీకర్ గారు నూతన ఒరవడి తీసుకుని రావడం జరిగిందన్నారు. ఈ కమిటీలలో మహిళా కమిటీలు కూడా ఉంటాయి ఈ కమిటీల ద్వారా అనేక సమస్యలపై చర్చలు జరుగుతుంటాయి అన్నారు. ప్రతి సమస్యను స్పీకర్ డిప్యూటీ, స్పీకర్ పరిష్కరించాలంటే కష్టమైన పని అని అసెంబ్లీలో వివిధ రకాల కమిటీలు ఉంటాయని ఒక కమిటీ ఒక్కక్క విషయం పైన చర్చించడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగానే మహిళ సాధికారతకు సంబంధించిన ఒక కమిటీ కూడా ఉందని ఆ కమిటీలలో వారు సమస్యలపై చర్చించి అసెంబ్లీకి వారి తరఫునుంచి చర్చ విధానాలను తెలియజేయడం, పరిష్కారం మార్గాలను అన్వేషించి స్పీకర్ దృష్టికి తీసుకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా అసెంబ్లీలో చర్చించిన అంశం ను కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. న్యాయపరమైన వంటి సమస్యలపై ప్రభుత్వం ద్వారా పరిష్కారం చేయడం జరుగుతుందని అన్నారు. లోకసభ స్పీకర్ గారు ప్రతి లోక సభలో కూడా ప్రతి సమస్యపై కూడా ఒక ప్రత్యేకమైన చర్చ ఉండాలని ఆ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా భాగస్వామ్యం కావాలని తెలియజేశారు. ఆ కమిటీ ద్వారా చర్చ జరిగిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు సరైనవి అయితే రాష్ట్ర అభివృద్ధికి సరైన నిర్ణయం చేయడమే ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. అసెంబ్లీలో వారం రోజులు పాటు చర్చలు కాకుండా సంవత్సరానికి 60 రోజులు చర్చలు జరిగేలా జరగాలని 60 రోజులు కూడా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం జరిగేలా ఉండాలని లోకసభ స్పీకర్ తెలిపారు అని అన్నారు. బాంబేలో ఈ మధ్యకాలంలో ఎస్టిమేట్ కమిటీ అలాగే ఎస్సీ ఎస్టీ లకు సంబంధించి సమావేశం కూడా జరిగిందని, అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మహిళ లకు సంబంధించిన కమిటీ ఏర్పాటు చేసే అవకాశం రావడం జరిగిందని తెలిపారు. మహిళా సాధికారత కమిటీలు తిరుపతి జిల్లాలో సెప్టెంబర్ 14, 15 తేదీలలో మహిళా సాధికారత సంబంధించిన సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఈ కమిటీకి ప్రతి రాష్ట్రాన్ని కూడా ఐదు ఆరు మంది సభ్యులు హాజరు కావడం జరుగుతుందని తెలిపారు. వీరందరూ కూడా రెండు రోజులు వారి సమస్యల మీద సుదీర్ఘంగా చర్చించి ఆ రిపోర్టుని పార్లమెంట్, అసెంబ్లీ ద్వారా గాని చర్చించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగానే తిరుపతి జిల్లాలో వేదికగా మహిళా సాధికారత సంబంధించిన కాన్ఫరెన్స్ నిర్వహించడం అదృష్టంగా భావించడం జరుగుతుందని తెలిపారు.. ఇది ఒక మంచి కార్యక్రమం అని మేము కార్యక్రమంలో భాగస్వామ్యం అవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమమును ఎక్కడా జరగని విధంగా కమిటీల వాళ్ళందరికీ అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి మీ అందరి సహకారం కావాలని, మన ప్రాంతంలో ఏర్పాటు చేయడం ఇది ఒక మంచి అవకాశం అని ప్రతి ఒక్కరు సహకరించాలని తెలిపారు. ఈ సమావేశం అనంతరం కాన్ఫరెన్స్ కు హాజరైన వారికి శ్రీకాళహస్తి దైవ దర్శనం ,శ్రీసిటీ, శ్రీహరికోట వంటి ప్రదేశాలలో సందర్శించడం జరుగుతుందని అన్నారు. మన రాష్ట్రంలో మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా నిర్వహణ కూడా అదే రోజు ఉంటుందని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటి స్పీకర్ మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి, దేశ ప్రధానులు మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారని అన్నారు. మహిళల విషయంలో డ్వాక్రా వ్యవస్థ దేశ స్థాయిలో ఉన్నప్పటికీ మన రాష్ట్రంలో ఉన్నంత మహిళాభ్యుదయం ఇంకెక్కడా లేదని తెలిపారు. మహిళా సాధికారత కమిటీలు పార్లమెంట్ లో 31 మంది ఉంటారని అలాగే ఒక రాష్ట్రానికి 6 మంది వరకు కమిటీ మెంబర్లు ఉంటారని, మన రాష్ట్రంలో ఈ సమావేశం నిర్వహించాలని అనుకున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని సూచించారని తెలిపారు. ఈ సమావేశం తిరుపతిలో సెప్టెంబర్ 14, 15 తేదీలలో నిర్వహించడం జరగనున్నదని మొదటిగా దైవ దర్శనాలతో మొదలై 14 న ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం అవుతుందని సమావేశం అనంతరం కమిటీ వారికి చంద్రగిరి కోటలో సౌండ్ అండ్ లైట్ షో ప్రదర్శనకు చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తామని, అలాగే 15 వ తేది శ్రీకాళహస్తి ప్రసస్తిని , కళంకారీ కళల ప్రశస్తిని కూడా తెలియజేసేలా ఏర్పాట్లు చేయడానికి చర్యలు తీసుకుంటామని శ్రీకాళహస్తి శాసన సభ్యులు చెప్పారని తెలిపారు. ఈ పర్యటనను కమిటీ వారికి గుర్తు ఉండేలా ఏర్పాట్లు చేయాలనీ అన్నారు. ఈ సమావేశం నిర్వహణకు తిరిగి 15 రోజుల తరువాత మళ్ళీ సమావేశం నిర్వహించుకున్దామని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతానికి జిల్లా కలెక్టర్, నగరపాలక కమీషనర్, ఇతర జిల్లా అధికారులు కృషి చేయాలని కోరారు.

జిల్లా ఇంచార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ...సెప్టెంబర్ 14 , 15 తేదీలలో జరిగే జాతీయ మహిళా సాధికారత కాన్ఫెరెన్స్ కు లైజన్ ఆఫీసర్ ల ఏర్పాటు, భద్రత, వసతి, సమావేశ వేదిక సంబందించిన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కాన్ఫెరెన్స్ విజయవంతం అయ్యేలా విధులు కేటాయించిన అధికారులు పనిచేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. తిరుపతి జిల్లా 34 మండలాలు 7 మున్సిపాలిటీలు, నాలుగు రెవెన్యూ డివిజన్ల కలిగి ఉందని స్పీకర్ కు తెలియజేశారు. జాతీయ మహిళా సాధికారిత కాన్ఫరెన్స్ కు సంభందించిన ఆజెండ్ ను సంబంధిత అధికారులతో కలిసి తయారు చేయడం జరిగిందని తెలిపారు. కాన్ఫరెన్స్ కు సమావేశం అయ్యే అతిధులకు స్వామివారి దర్శనం,సమావేశ వేదిక, అకామిడేషన్, బోజన వసతి, రవాణా, భద్రత ఏర్పాట్ల పై ప్రణాళిక బద్దంగా ప్లాన్ చేయడం జరిగిందని తెలిపారు. 14, 15 తేదీలలో రెండు రోజులు కాన్ఫెరెన్స్ ఉందని వివిధ హోటల్ లలో అధితులకు బస ఏర్పాటు చేయడంతో పాటు, అన్ని ప్రదేశాలలో భద్రతా కట్టుదిట్టంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడం జరుగుతుందని, కాన్ఫెరెన్స్ కు లైజన్ అధికారులను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. రెండు రోజుల కాన్ఫెరెన్స్ అనంతరం 16 వ తేదీన అతిధులు శ్రీసిటీ, శ్రీహరికోట తదితర ప్రాంతాలలో పర్యటించేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

Tags:    

Similar News