AP Minister Atchennaidu : ఆ పథకం అమలు చేయాలంటే అంధ్రాను అమ్మాలి
మహిళలకు రూ. 1500 పథకంపై మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్య;
By : Politent News Web 1
Update: 2025-07-22 07:58 GMT
కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఒక పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ను అమ్మేయాలని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశంచి అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీల్లో అన్నీ నెరవేర్చామని ఒక్కటి మాత్రం నెరవేర్చలేకపోయామని ఒప్పుకున్నారు. మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తామని ఇచ్చిన హామీని మాత్రం అమలు చేయలేదని… ఈ హామీ అమలు చేయాలంటే ఏపీని అమ్మేయాలని… అంత డబ్బు అవసరమవుతుందని అచ్చెన్నాయుడు అన్నారు. అయితే మహిళలకు ఇచ్చిన ఈ హామీని కూడా ఎలా అమలు చేయాలి, ఏం చేయాలని ఆలోచన చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వెళుతున్నారని అచ్చెన్నాయుడు వెంటనే అనునయ వచనాలు పలికారు