AP BJP Chief Madhav : ట్రంప్ విధానాలు ప్రపంచ దేశాలను అల్లాడిస్తున్నాయి
ఒంగోలు ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో బీజేపీ చీఫ్ మాధవ్;
పొగాకుకు ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్‌మాధవ్ సూచించారు. గురువారం ఆయన ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన చాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో వాణిజ్య రంగం సంక్షోభంలో ఉండటంతో పొగాకు పంటకు మంచి ధర లభించిందని, దాన్ని దృష్టిలో పెట్టకుని తరువాత సంవత్సరాల్లో రైతులు పొగాకు పంటను అధికంగా పండించారని అన్నారు. ట్రంప్ విధిస్తున్న అడ్డదిడ్డమైన సంకాలతో మన వాణిజ్య రంగంపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. ట్రంప్ తీసుకుంటున్న అసంబద్ద నిర్ణయాల వల్ల ప్రంపచదేశాలు అల్లాడిపోతున్నాయని, ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నాయని మాధవ్ వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తూ మెరుగైన పాలన అందిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ ఏడాది రాష్ట్రానికి పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వీటి ద్వారా సంపద సృష్టి జరుగుతుందన్నారు. లిక్కర్ స్కామ్ లో ఎంత పెద్ద తలకాయలు ఉన్నా చట్టపరమైన చర్యలు తప్పవని ఏపీ బీజేపీ అధ్యక్షుడు స్పష్టం చేశారు. అరువు తెచ్చుకున్న జనాలతో వైఎస్‌జగన్ రాష్ట్రంలో పర్యటనలు చేస్తూ శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నారని అన్నారు. రానున్న స్థానిక సంస్ధల ఎన్నికల్లో కూటమి పార్టీలు కలసే పోటీ చేస్తాయని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు.