Vallabhaneni Vamsi : వైఎస్‌.జగన్ని కలసిన వల్లభనేని వంశీ దంపతులు

అండగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలపిన వంశీ;

Update: 2025-07-03 12:29 GMT

గన్నవరం మాజీ శాసనసభ్యుడు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వల్లభనేని వంశీమోహన్‌ గురువారం సతీ సమేతంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహనరెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. 140 రోజుల తరువాత జైలు నుంచి బెయిలుపై నిన్న బుధవారం విడుదలైన వంశీ గురువారం తమ పార్టీ అధ్యక్షుడిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వంశీ యోగక్షేమాలను వైఎస్‌.జగన్‌ అడిగి తెలుసుకున్నారు. అలాగే 11 అక్రమ కేసులు పెట్టి వంశీని 140 రోజుల పాటు జైలులో నిర్బంధించిన వ్యవహారంపై వంశీతో వైఎస్‌.జగన్‌ చర్చించారు. అన్ని కేసుల్లో బెయిల్‌ లభించినా విడుదల అడ్డుకునేందుకు సుప్రీం కోర్టులో ప్రభుత్వం చేసిన ప్రయత్నాల ప్రస్తావన ఇద్దిరి మధ్య వచ్చింది. కష్టకాలంలో అండగా తన కుటుంబానికి అండగా నిలిచినందుకు వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌.జగన్మోహనరెడ్డికి వల్లభనేని వంశీ దంపతులు ధన్యవాదాలు తెలియజేశారు.

Tags:    

Similar News