Pulivendula ZPTC : పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైఎస్‌ఆర్‌సీపీ ఓటమి
డిపాజిట్లు కోల్పోయిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి హేమంత్ రెడ్డి;
టీడీపీ అభ్యర్థి ఘన విజయం
కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 6035 ఓట్ల మెజార్టీతో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డిపై గెలుపొందారు. తెలుగుదేశం అభ్యర్ధికి 6716 ఓట్లు పోలవ్వగా, వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్ధికి 683 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధికి 101 ఓట్లు పోలయ్యాయి. ఈనెల 12వ తేదీన జరిగిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో 74 శాతం ఓట్లు పోలయ్యాయి. గడచిన ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ ఎన్నక ఎప్పుడూ ఏకగ్రీవంగానే జరుతోంది. ఈ సారి ఎన్నికలు జరగడం టీడీపీ భారీ మెజారీట్టీతో జడ్పీటీసీ స్ధానాన్ని కైవశం చేసుకోవడంతో పులివెందులలో మొదటి సారి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగాయని అధికార టీడీపీ చెపుతోంది. అయితే కనీసం పోలీంగ్ ఏజెంట్లను కూడా బూత్‌లలోకి రానివ్వకుండా పొరుగు మండలాల నుంచి టీడీపీ కార్యకర్తలను, నాయకులను తెచ్చుకుని దొంగ ఓట్లు వేసుకుని గెలిచారని వైఎస్‌ఆర్‌సీపీ ఆరోపిస్తోంది. పోలీసుల సహకారంతో వైసీపీ వాళ్ళు ఎవ్వరినీ ఓట్టు వేయనివ్వకండా వాళ్ళే వేసుకున్నారని కడప ఎంపీ వైఎస్‌అవినాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. టీడీపీ మాత్రం ఇది ప్రజాస్వామ్య విజయమని చెపుతోంది.