Budget Bikes : లక్ష లోపు బడ్జెట్లో అదిరిపోయే బైక్ కావాలా? ఈ మూడు బైక్స్‌లో మీకు నచ్చింది తీసుకోండి
ఈ మూడు బైక్స్‌లో మీకు నచ్చింది తీసుకోండి
Budget Bikes : లక్ష రూపాయల లోపు బడ్జెట్‌లో 125 సీసీ ఇంజిన్‌తో కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ బడ్జెట్లో టీవీఎస్, హీరో మోటోకార్ప్, బజాజ్ వంటి పెద్ద బ్రాండ్ల నుంచి మంచి ఆప్షన్లు ఉన్నాయి. పవర్, స్టైల్, అద్భుతమైన మైలేజీని అందించే ఈ మూడు బైక్‌ల గురించి చూద్దాం.
బజాజ్ పల్సర్ ఎన్125
బజాజ్ ఆటో నుంచి వచ్చిన ఈ బైక్ బ్లూటూత్ కనెక్టెడ్ డిజిటల్ డిస్‌ప్లేతో వస్తుంది. దీనిలో 124.59 సీసీ పవర్‌ఫుల్ ఇంజిన్ ఉంది, ఇది 12పీఎస్ పవర్, 11ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కేవలం కొన్ని సెకన్లలోనే 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని కంపెనీ చెబుతోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 99,213 నుంచి మొదలవుతుంది. ఈ బైక్ లీటర్‌కు 60 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది.
టీవీఎస్ రైడర్ 125
టీవీఎస్ మోటార్ నుంచి వచ్చిన ఈ బైక్‌లో 124.8 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 11.4హెచ్‌పి పవర్, 11.2ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 85 కన్నా ఎక్కువ కనెక్టెడ్ ఫీచర్స్, వాయిస్ అసిస్ట్ వంటి అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. ఢిల్లీలో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 99,715 నుంచి మొదలవుతుంది. ఈ బైక్ లీటర్‌కు 56 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది.
హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్
హీరో మోటోకార్ప్ నుంచి వచ్చిన ఈ బైక్ స్టైలిష్‌గా కనిపిస్తుంది. దీనిలో 124.7 సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 11.5బీహెచ్‌పి పవర్, 10.5ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సేఫ్టీ కోసం ముందు డిస్క్ బ్రేక్, కంట్రోల్ కోసం సింగిల్ ఛానల్ ఏబీఎస్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 98,839 నుంచి మొదలవుతుంది. ఈ బైక్ లీటర్‌కు 66 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
ఈ మూడు బైక్‌లు తక్కువ బడ్జెట్‌లో మంచి పవర్, స్టైల్, మంచి మైలేజీని అందిస్తాయి. కాబట్టి మీ అవసరాలకు తగ్గట్టుగా వీటిలో ఏదైనా ఒక దానిని సెలక్ట్ చేసుకోవచ్చు.