Jeep : అడ్వెంచర్ కింగ్ జీప్ ర్యాంగ్లర్ విల్లీస్ 41 రీ-ఎంట్రీ.. అదే రాజసం, గంభీరమైన లుక్

అదే రాజసం, గంభీరమైన లుక్

Update: 2026-02-25 09:57 GMT

Jeep : ప్రపంచవ్యాప్తంగా ఆఫ్-రోడింగ్ వాహనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే జీప్ ఇండియాలో తన పాత వైభవాన్ని మళ్లీ గుర్తు చేస్తోంది. 1941 కాలం నాటి ఆర్మీ వాహనం విల్లీస్ ఎంబీ స్ఫూర్తితో రూపొందించిన సరికొత్త ర్యాంగ్లర్ విల్లీస్ 41 లిమిటెడ్ ఎడిషన్‌ను కంపెనీ రీ-లాంచ్ చేసింది. గతంలో 2025లో విడుదలైన ఈ స్పెషల్ ఎడిషన్ కేవలం 7 రోజుల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడైపోవడంతో, ఇప్పుడు మరింత మెరుగైన ఫీచర్లు, గంభీరమైన లుక్‌తో దీనిని మళ్ళీ మార్కెట్లోకి తీసుకువచ్చారు.

ఈ స్పెషల్ ఎడిషన్ కారును కేవలం 41 యూనిట్లు మాత్రమే అమ్మకానికి ఉంచారు. ఇది జీప్ ర్యాంగ్లర్ రూబికాన్ వేరియంట్‌పై ఆధారపడి రూపొందించబడింది. సాధారణ మోడల్ కంటే ఈ లిమిటెడ్ ఎడిషన్ కోసం రూ.2 లక్షల అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.68.31 లక్షలు. ఒకవేళ మీరు ఈ కారును మరింత పవర్‌ఫుల్ అడ్వెంచర్ వాహనంగా మార్చుకోవాలనుకుంటే, రూ.3.60 లక్షల విలువైన ప్రత్యేక యాక్సెసరీ ప్యాకేజీని కూడా కొనుగోలు చేయవచ్చు.

అడ్వెంచర్ ప్రియుల కోసం ఈ కారులో అదిరిపోయే ఫీచర్లను జోడించారు. ఇందులో మోటరైజ్డ్ సైడ్ స్టెప్స్, ఇన్-బిల్ట్ డిజిటల్ వీడియో రికార్డర్ వంటివి ఉన్నాయి. ఇక ఆప్షనల్ కిట్‌లో భాగంగా రూఫ్ క్యారియర్, సైడ్ లాడర్, సన్‌రైడర్ సాఫ్ట్ రూఫ్ టాప్ వంటివి లభిస్తాయి. కొండలు, కోనలు తిరిగే వారికి ఈ ఫీచర్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. 1941 నాటి విల్లీస్ వారసత్వాన్ని నేటి ఆధునిక టెక్నాలజీతో మేళవించి ఈ వాహనాన్ని సిద్ధం చేశారు.

స్టెల్లాంటిస్ ఇండియా బిజినెస్ హెడ్ కుమార్ ప్రియేష్ ఈ లాంచ్ సందర్భంగా మాట్లాడుతూ.. "విల్లీస్ చరిత్ర కేవలం ఒక కథ మాత్రమే కాదు, అది జీప్ బ్రాండ్, ఆత్మ. 1941 నాటి విల్లీస్ ఎంబీ రాజసాన్ని, నేటి తరం డ్రైవర్లకు కావలసిన సామర్థ్యాన్ని ఈ ర్యాంగ్లర్ విల్లీస్ 41 2.0 లో చూడవచ్చు" అని పేర్కొన్నారు. బలమైన నిర్మాణం, అజేయమైన 4x4 శక్తి కలిగిన ఈ జీప్, కేవలం కారు మాత్రమే కాదు, అడ్వెంచర్ కోరుకునే వారికి ఒక కల అని చెప్పొచ్చు.

Tags:    

Similar News