Ola : 161 కి.మీ. రేంజ్‌తో కొత్త ఈ-స్కూటర్.. ఓలా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుందా?

ఓలా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుందా?;

Update: 2025-08-04 07:51 GMT

Ola : భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ సంస్థ ఎథర్ ఎనర్జీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. ఇది ఎథర్ 450ఎస్ కొత్త వెర్షన్. ఇందులో 3.7 kWh కెపాసిటీ ఉన్న పెద్ద బ్యాటరీని ఇచ్చారు. దీనితో ఒకసారి ఛార్జ్ చేస్తే 161 కిలోమీటర్ల వరకు రేంజ్ లభిస్తుంది. అయితే, వాస్తవ పరిస్థితుల్లో రేంజ్ కొద్దిగా తక్కువగా ఉండవచ్చు. మార్కెట్‌లో ఇది ఓలా ఎస్1 ఎయిర్, బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్, హీరో విడా వి1 వంటి లాంగ్ రేంజ్ స్కూటర్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

ఈ కొత్త ఎథర్ 450ఎస్ ధర రూ.1.46 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ స్కూటర్ బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. డెలివరీలు ఆగస్టు 2025 నుంచి ప్రారంభమవుతాయి. కొత్త వెర్షన్‌లో ఎథర్ స్పోర్టీ డిజైన్ అలాగే ఉంది. ఇందులో షార్ప్ బాడీ లైన్స్, సన్నటి ఎల్‌ఈడీ లైట్స్, స్ట్రాంగ్ బాడీ లభిస్తాయి. పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ స్కూటర్ బరువు, బ్యాలెన్స్ తేలికగా, వేగంగా ఉందని కంపెనీ పేర్కొంది.

ఛార్జింగ్ కోసం దేశవ్యాప్తంగా 3300కి పైగా పాయింట్లతో ఉన్న ఎథర్ గ్రిడ్ నెట్‌వర్క్ అందుబాటులో ఉంది. అలాగే హోమ్ ఛార్జింగ్ సెటప్‌తో 0 నుంచి 80 శాతం వరకు కేవలం 4.5 గంటల్లో ఛార్జ్ చేసుకోవచ్చు. బ్యాటరీపై సేఫ్టీ కోసం ఎథర్ ఎయిట్‌70 అనే పేరుతో 8 ఏళ్లు లేదా 80,000 కిలోమీటర్ల వారంటీని అందిస్తోంది. ఎథర్ 450ఎస్ 3.7 kWh వెర్షన్‌లో అదే 5.4 kW మోటార్ ఉంది. ఇది 22 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ కేవలం 3.9 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ./గంట వేగాన్ని అందుకుంటుంది. దాని టాప్ స్పీడ్ 90 కి.మీ./గంట. ఇందులో స్మార్ట్ ఎకో, ఎకో, రైడ్, స్పోర్ట్ అనే నాలుగు రైడ్ మోడ్స్ ఉన్నాయి. వీటితో అవసరాన్ని బట్టి మైలేజ్ లేదా వేగాన్ని ఎంచుకోవచ్చు.

ఈ స్కూటర్‌లో 7 అంగుళాల డీప్‌వ్యూ డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, ఆటోహోల్డ్, ఫాల్ సేఫ్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, దొంగతనం అలర్ట్ వంటి అనేక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. దీని సాఫ్ట్‌వేర్‌ను ఓటీఏ అప్‌డేట్‌ల ద్వారా ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

Tags:    

Similar News