MG Hector: కొత్త లుక్‌తో ఎంజీ హెక్టార్ రీ-ఎంట్రీ.. బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్లు లాంచ్
బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్లు లాంచ్
MG Hector: జెఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా భారత మార్కెట్లోకి 2026 ఎంజీ హెక్టార్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ స్పెషల్ ఎడిషన్లను అధికారికంగా విడుదల చేసింది. 5-సీటర్ హెక్టార్ లిమిటెడ్ ఎడిషన్ మోడళ్ల ప్రారంభ ధరను రూ.19,99,800 (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. స్పోర్టీ డిజైన్, అధునాతన సాంకేతికతతో వచ్చిన ఈ రెండు కార్లలో 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఇది 143 PS పవర్, 250 NM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉండటం విశేషం.
బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ వినూత్న డిజైన్ హంగులు
ఈ రెండు స్పెషల్ ఎడిషన్లలో కలర్ థీమ్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. బ్లాక్‌స్టార్మ్ మోడల్ పూర్తిగా ఆల్-బ్లాక్ ఎక్స్‌టీరియర్ థీమ్‌తో రాగా, స్నోస్టార్మ్ మోడల్ పెర్ల్ వైట్ బాడీ, స్టారీ బ్లాక్ రూఫ్‌తో డ్యూయల్ టోన్ లుక్‌లో మెరిసిపోతోంది. రెండింటిలోనూ స్టార్మ్ హెక్స్ గ్రిల్, డార్క్ క్రోమ్ ఎంజీ లోగో, పియానో బ్లాక్ రూఫ్ రయిల్స్, ఆల్-బ్లాక్ హెడ్‌లాంప్‌లు ఇచ్చారు. రెడ్ బ్రేక్ కాలిపర్లు కలిగిన ఆరా స్టార్మ్ బ్లేడ్ అలాయ్ వీల్స్ ఎస్‌యూవీకి స్పోర్టీ లుక్‌ను అందిస్తున్నాయి. లోపలి భాగంలో బ్లాక్ లెదర్ సీట్లు, ఫ్రంట్ హెడ్‌రెస్ట్‌లపై ఎడిషన్ పేర్లు, గన్‌మెటల్ ఫినిషింగ్ తో కూడిన లెదర్ స్టీరింగ్ వీల్, 8-కలర్ యాంబియంట్ లైటింగ్, డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్ అమర్చారు.
35.56 సెంటీమీటర్ల డిస్‌ప్లే
హెక్టార్ కొత్త ఎడిషన్లలో 35.56 సెంటీమీటర్ల (14 అంగుళాలు) భారీ పోర్ట్రెయిట్ హెచ్‌డీ టచ్‌స్క్రీన్, 17.78 సెంటీమీటర్ల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అందించారు. స్క్రీన్ ప్రాసెసింగ్‌ను వేగవంతం చేయడానికి స్మార్ట్ బూస్ట్ సిస్టమ్ పనిచేస్తుంది. వేళ్లతో సైగలు చేయడం ద్వారా ఏసీ, నేవిగేషన్, మ్యూజిక్ కంట్రోల్ చేసేందుకు 'ఐ-స్వైప్' ఫీచర్ సహాయపడుతుంది. ఐ-స్మార్ట్ సిస్టమ్ ద్వారా 70 కంటే ఎక్కువ కనెక్టెడ్ కార్ ఫీచర్లు, డిజిటల్ బ్లూటూత్ కీ, కీ-షేరింగ్ సదుపాయాలు లభిస్తాయి. స్మార్ట్‌ఫోన్ నుంచే ఏసీ, లైటింగ్, ఆడియో వ్యవస్థలను ఆపరేట్ చేసుకునే సౌలభ్యం కల్పించారు.
అడ్వాన్స్‌డ్ అడాస్ సేఫ్టీ
ప్రయాణికుల భద్రత కోసం 360-డిగ్రీల హెచ్‌డీ కెమెరా, వీల్ వ్యూ, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, ఏబీఎస్, ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్-హోల్డ్ కంట్రోల్ వంటి సదుపాయాలు ఇచ్చారు. అధునాతన అడాస్ టెక్నాలజీ, రైన్ సెన్సింగ్ వైపర్లు భద్రతను మరింత పెంచుతాయి. కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి ఎంజీ సంస్థ ఆన్-రోడ్ ధరపై 84 నెలల కాలపరిమితితో 100 శాతం ఫైనాన్స్ సదుపాయం కల్పిస్తోంది. దీనికి తోడు ఎంజీ షీల్డ్ 3+3+3 ప్యాకేజీ కింద 3 ఏళ్ల అన్‌లిమిటెడ్ కిలోమీటర్ల వారంటీ, 3 ఏళ్ల రోడ్‌సైడ్ అసిస్టెన్స్, 3 ఉచిత సర్వీసులను అందిస్తున్నారు.