Tata Tiago : కొత్త అవతారంలో టాటా టియాగో.. టెస్టింగ్‌లో అదరగొడుతున్న ఫేస్‌లిఫ్ట్ వెర్షన్
టెస్టింగ్‌లో అదరగొడుతున్న ఫేస్‌లిఫ్ట్ వెర్షన్
Tata Tiago : టాటా మోటార్స్ తన ఫేవరెట్ హ్యాచ్‌బ్యాక్ టియాగోను సరికొత్త హంగులతో మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం భారత రోడ్లపై ఈ కారు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ముమ్మరంగా టెస్టింగ్ జరుపుకుంటోంది. డిజైన్ పరంగా భారీ మార్పులు ఉండబోతున్నాయని స్పై షాట్స్ ద్వారా అర్థమవుతోంది. ముఖ్యంగా వెనుక వైపు కొత్త టెయిల్ లైట్లు, బ్లింక్ అయ్యే టర్న్ ఇండికేటర్లతో ఈ కారు మరింత స్టైలిష్‌గా కనిపించనుంది. టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో ప్రధానంగా ఫ్రంట్, రియర్ డిజైన్‌ను టాటా మోటార్స్ మార్చింది. దీని హెడ్‌లైట్లు ఇప్పుడు మరింత స్లిమ్‌గా, ప్రొజెక్టర్ ఎల్‌ఈడీ యూనిట్లతో రానున్నాయి. ముందరి గ్రిల్, బంపర్ కూడా పూర్తిగా కొత్తగా ఉండబోతున్నాయి. వెనుక వైపు ఇంటిగ్రేటెడ్ రూఫ్ స్పాయిలర్, హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ వంటి మార్పులు కారుకు స్పోర్టీ లుక్ ఇస్తాయి. సైడ్ ప్రొఫైల్‌లో మార్పులు లేకపోయినా, కొత్త జామెట్రిక్ డిజైన్ అల్లాయ్ వీల్స్ కారుకు కొత్తదనాన్ని ఇస్తాయి.
ఇంటీరియర్ లో టెక్నాలజీ జోరు
కారు లోపలి భాగంలో కూడా టాటా భారీ మార్పులే చేస్తోంది. టాటా కర్వ్, నెక్సాన్ వంటి పెద్ద కార్లలో ఉండే 10.25-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇందులో ఉండే అవకాశం ఉంది. అలాగే, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్-సెన్సిటివ్ ఏసీ కంట్రోల్స్, కొత్త డాష్‌బోర్డ్ లేఅవుట్‌ను టాటా అందిస్తోంది. ఈ సెగ్మెంట్‌లోనే మొదటిసారిగా 360-డిగ్రీ కెమెరాను కూడా టియాగోలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం.
సేఫ్టీలో టాటా మార్క్
టాటా కార్లు అంటేనే సేఫ్టీకి మారుపేరు. కొత్త టియాగోలో కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లు (హయ్యర్ వేరియంట్లలో), ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఇప్పటికే గ్లోబల్ NCAP రేటింగ్‌లో మంచి గుర్తింపు పొందిన టియాగో, ఈ అప్‌డేటెడ్ సేఫ్టీ ఫీచర్లతో మరింత సురక్షితంగా మారనుంది.
టర్బో ఇంజన్‌తో పవర్ ఫుల్ ఎంట్రీ?
ఇంజిన్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఉన్న 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ (86 PS పవర్) కొనసాగుతుంది. ఇది మాన్యువల్, AMT గేర్‌బాక్స్ ఆప్షన్లతో వస్తుంది. అయితే, టాటా పంచ్ తరహాలో టియాగోలో కూడా 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను ప్రవేశపెట్టాలని టాటా యోచిస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే, ఈ సెగ్మెంట్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ హ్యాచ్‌బ్యాక్‌గా టియాగో నిలుస్తుంది. సీఎన్‌జీ వెర్షన్‌లో కూడా ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో ఏఎమ్‌టీ (AMT) ఆప్షన్ అందుబాటులో ఉండనుంది.