5 New SUVs : హ్యుందాయ్ క్రెటాకి షాక్.. మార్కెట్లోకి 5 కొత్త మిడ్-సైజ్ ఎస్యూవీలు

మార్కెట్లోకి 5 కొత్త మిడ్-సైజ్ ఎస్యూవీలు;

Update: 2025-08-13 09:35 GMT

5 New SUVs : భారతదేశంలో మిడ్-సైజ్ ఎస్యూవీ మార్కెట్‌లో హ్యుందాయ్ క్రెటా చాలా కాలంగా అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు ఈ డామినేషన్‌కు ముగింపు పలికేందుకు మారుతి సుజుకి, టాటా మోటార్స్, రెనాల్ట్, నిస్సాన్, కియా వంటి ప్రముఖ కార్ల కంపెనీలు తమ సరికొత్త ఎస్యూవీలను లాంచ్ చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ రాబోయే మోడల్స్‌లో కొత్త డిజైన్, పవర్ఫుల్ ఇంజిన్లు, అడ్వాన్సుడ్ ఫీచర్లు లభించనున్నాయి. త్వరలో మార్కెట్‌లోకి రాబోతున్న ఆ 5 కొత్త ఎస్యూవీల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

1. మారుతి సుజుకి ఎస్క్యుడో

మారుతి సుజుకి తమ సరికొత్త ఎస్యూవీ ఎస్క్యుడోను భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందులో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు, స్ట్రాంగ్ హైబ్రిడ్, సీఎన్జీ ఆప్షన్లు కూడా ఉండవచ్చని అంచనా. పనోరమిక్ సన్‌రూఫ్, ప్రీమియం ఫీచర్లు, ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) టెక్నాలజీతో ఈ ఎస్యూవీ 2025 చివరి నాటికి మార్కెట్‌లోకి రావచ్చు.

2. టాటా సియెరా

టాటా మోటార్స్ తమ ఐకానిక్ సియెరా కారును కొత్త మిడ్-సైజ్ ఎస్యూవీగా తిరిగి తీసుకురాబోతోంది. ఇది పెట్రోల్, డీజిల్, ఇంకా ఎలక్ట్రిక్ వెర్షన్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు, కనెక్టెడ్ కార్ ఫీచర్లు, అత్యుత్తమ సేఫ్టీ ప్యాకేజీతో ఇది 2025 చివరిలో లాంచ్ కావచ్చు.

3. రెనాల్ట్ డస్టర్ ఫేస్‌లిఫ్ట్

రెనాల్ట్ తమ పాపులర్ ఎస్యూవీ డస్టర్‎ను సరికొత్త అవతార్‌లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. కొత్త మోడల్‌లో ఆధునిక డిజైన్, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, 1.3-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, ఇంకా ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉండవచ్చని తెలుస్తోంది. దీని లాంచింగ్ కూడా 2025 చివరి నెలల్లో జరిగే అవకాశం ఉంది.

4. నిస్సాన్ కొత్త ఎస్యూవీ

నిస్సాన్ కంపెనీ రాబోయే రెనాల్ట్ డస్టర్ ఆధారంగా ఒక కొత్త ఎస్యూవీని మార్కెట్‌లోకి తీసుకురాబోతోంది. డిజైన్, బ్రాండ్ పేరు వేరుగా ఉన్నప్పటికీ, దీని ఫీచర్లు దాదాపుగా డస్టర్ మాదిరిగానే ఉంటాయి. అయితే, ఇందులో ప్రత్యేకమైన ఇంటీరియర్ కలర్ ఆప్షన్లు, కొన్ని ప్రత్యేక టెక్నాలజీ ప్యాకేజీలు లభించవచ్చు. ఈ ఎస్యూవీ 2026 ప్రారంభంలో లాంచ్ అవుతుందని అంచనా.

5. కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్

కియా మోటార్స్ తమ బెస్ట్-సెల్లింగ్ ఎస్యూవీ సెల్టోస్ కొత్త తరం మోడల్‌ను 2026 ప్రారంభంలో తీసుకురావాలని యోచిస్తోంది. కొత్త డిజైన్, అప్‌గ్రేడ్ చేసిన ADAS టెక్నాలజీ, హైబ్రిడ్ వెర్షన్, మరింత ప్రీమియం క్యాబిన్ వంటి ఫీచర్లతో ఇది క్రెటాకు నేరుగా పోటీగా నిలవనుంది.

Tags:    

Similar News