Ather 450X : ట్రాఫిక్ తిప్పలకు చెక్..ఏథర్ నయా అప్‌డేట్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

ఏథర్ నయా అప్‌డేట్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

Update: 2026-01-09 13:15 GMT

Ather 450X : ఎలక్ట్రిక్ స్కూటర్ల రంగంలో సరికొత్త టెక్నాలజీతో దూసుకెళ్తున్న ఏథర్ ఎనర్జీ, తన కస్టమర్లకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. ఏథర్ తన పాపులర్ మోడల్ 450X కోసం సరికొత్త ఇన్ఫినిట్ క్రూయిజ్ సిస్టమ్‌ను పరిచయం చేసింది. సాధారణంగా కార్లలో మాత్రమే కనిపించే ఈ క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్‌ను, ఇప్పుడు ఒక సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా స్కూటర్లలోకి తీసుకురావడం విశేషం. దీనివల్ల మీ పాత స్కూటర్ ఇప్పుడు మునుపటి కంటే మరింత స్మార్ట్‌గా మారిపోనుంది.

సాధారణంగా క్రూయిజ్ కంట్రోల్ అంటే హైవేల మీద వేగంగా వెళ్లడానికి వాడుతుంటారు. కానీ ఏథర్ డిజైన్ చేసిన ఇన్ఫినిట్ క్రూయిజ్ మాత్రం మన భారతీయ నగరాల ట్రాఫిక్‌కు తగ్గట్టుగా రూపొందించబడింది. ఇది కేవలం గంటకు 10 కిలోమీటర్ల నుంచి 90 కిలోమీటర్ల వేగం వరకు పనిచేస్తుంది. విపరీతమైన రద్దీ ఉన్న చోట, పదే పదే యాక్సిలరేటర్ తిప్పాల్సిన అవసరం లేకుండా ఇది రైడర్ పనిని సులభతరం చేస్తుంది.

ఈ సిస్టమ్‌లోని గొప్పతనం ఏమిటంటే.. మీరు బ్రేక్ వేసినా లేదా స్పీడ్ పెంచినా ఇది పూర్తిగా ఆగిపోదు. సాధారణ క్రూయిజ్ కంట్రోల్ అయితే బ్రేక్ వేయగానే డిస్‌కనెక్ట్ అవుతుంది.. కానీ ఏథర్ సిస్టమ్ మీ కొత్త వేగానికి తగ్గట్టుగా ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవుతుంది. దీనివల్ల ట్రాఫిక్‌లో పదే పదే ఈ ఫీచర్‌ను ఆన్ చేయాల్సిన తలనెప్పి ఉండదు. ఇది రైడర్ చేతి మణికట్టుపై ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఈ కొత్త అప్‌డేట్‌లో ప్రధానంగా మూడు మోడ్లు ఉన్నాయి. మొదటిది సిటీ క్రూయిజ్, ఇది ట్రాఫిక్ పరిస్థితులకు తగ్గట్టుగా స్కూటర్ వేగాన్ని నియంత్రిస్తుంది. రెండవది హిల్ కంట్రోల్, కొండ ప్రాంతాల్లో లేదా ఎత్తుపల్లాల మీద వెళ్లేటప్పుడు స్కూటర్ వెనక్కి జారిపోకుండా లేదా వేగం తగ్గకుండా స్థిరంగా ఉంచుతుంది. మూడవది కాల్ కంట్రోల్, ఇది చాలా తక్కువ వేగంతో, ముఖ్యంగా గుంతల రోడ్లపై స్కూటర్ బ్యాలెన్స్ తప్పకుండా మెల్లగా వెళ్లేలా చేస్తుంది.

ఈ సరికొత్త ఫీచర్ ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్ ద్వారా కస్టమర్లకు అందుతోంది. జనవరి 1, 2025 తర్వాత ఏథర్ 450X కొనుగోలు చేసిన దాదాపు 44,000 మంది కస్టమర్లకు ఈ అప్‌డేట్ లభిస్తుంది. అలాగే ఇకపై షోరూమ్ నుంచి వచ్చే కొత్త స్కూటర్లలో ఈ ఫీచర్ ఇన్‌బిల్ట్‌గా రానుంది. ఈ అప్‌డేట్ లో ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉండటం వల్ల వర్షాకాలంలో లేదా జారే రోడ్లపై టైర్లు స్కిడ్ అవ్వకుండా మంచి గ్రిప్ లభిస్తుంది.

Tags:    

Similar News