Mahindra : మహీంద్రా కార్లపై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.2.95లక్షల వరకు భారీ తగ్గింపు

ఏకంగా రూ.2.95లక్షల వరకు భారీ తగ్గింపు;

Update: 2025-08-21 05:57 GMT

Mahindra : మహీంద్రా కంపెనీ కారు కొనాలని ఆలోచిస్తే ఈ ఆగస్టు నెల ముగిసేలోపే కొనేయండి. ఈ ఆగస్టు నెలలో ఈ కార్లపై ఏకంగా రూ. 2.95 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. మహీంద్రా థార్, థార్ రాక్స్, స్కార్పియో, ఎక్స్‌యూవీ400, ఎక్స్‌యూవీ700, మరాజో, బొలెరో వంటి ప్రముఖ మోడళ్లపై కంపెనీ బంపర్ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ ఆఫర్లలో ఎక్స్ఛేంజ్/స్క్రాప్ బోనస్, యాక్సెసరీస్ ప్యాకేజీలు, కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి. మరి ఏ మోడల్‌పై ఎంత వరకు తగ్గింపు లభిస్తుందో వివరంగా చూద్దాం.

మహీంద్రా బొలెరో

మహీంద్రా బొలెరో ఎస్‌యూవీ అంటే గ్రామీణ ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యం పొందిన కారు. ఈ ఆగస్టులో బొలెరో నియో ఎన్10 వేరియంట్‌పై రూ. 1.39 లక్షల వరకు, బొలెరో బీ6 ఆప్ట్ వేరియంట్‌పై రూ. 1.30 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు. ఇక మామూలు బొలెరో మోడల్‌పై రూ. 1,10,700 వరకు తగ్గింపుతో పాటు, రూ. 20,000 విలువైన యాక్సెసరీస్‌ను ఉచితంగా అందిస్తున్నారు. బొలెరో నియోపై రూ. 1.09 లక్షల వరకు డిస్కౌంట్, రూ. 30,000 విలువైన యాక్సెసరీస్‌ లభిస్తున్నాయి. అలాగే, బొలెరో నియో ప్లస్ మోడల్‌పై కూడా రూ. 85,000 వరకు తగ్గింపు ఉంది. ఈ ఆఫర్లు బొలెరో కార్లను కొనుగోలు చేయాలనుకునే వారికి గొప్ప అవకాశం.

మహీంద్రా థార్, స్కార్పియోపై డిస్కౌంట్లు

మహీంద్రా థార్.. ఈ ఎస్‌యూవీకి దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ కారుకు ఫ్యాన్స్ ఎక్కువ. ఆగస్టులో థార్ 3 డోర్, 5 డోర్ రెండు మోడళ్లపైనా రూ. 25,000 వరకు డిస్కౌంట్ ఉంది. ఇది థార్ కొనాలనుకునే వారికి చాలా మంచి అవకాశం. ఇక మహీంద్రా మరో పవర్ ఫుల్ ఎస్‌యూవీ స్కార్పియోపై కూడా బంపర్ ఆఫర్లు ఉన్నాయి. స్కార్పియో క్లాసిక్‌పై రూ. 70,000 వరకు తగ్గింపుతో పాటు, రూ. 30,000 విలువైన యాక్సెసరీస్‌ లభిస్తున్నాయి. అలాగే, స్కార్పియో ఎన్‌పై రూ. 55,000 వరకు తగ్గింపుతో పాటు, రూ. 20,000 విలువైన యాక్సెసరీస్ కూడా అందిస్తున్నారు.

ఎక్స్‌యూవీ400, ఇతర మోడళ్లపై భారీ ఆఫర్లు

మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లలో ముఖ్యమైనది ఎక్స్‌యూవీ400. ఈ కారుపై ఈ నెలలో అత్యధిక డిస్కౌంట్ లభిస్తోంది. ఎక్స్‌యూవీ400 కొనుగోలు చేస్తే ఏకంగా రూ. 2.95 లక్షల వరకు భారీ తగ్గింపు పొందే అవకాశం ఉంది. ఇక ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీపై రూ. 50,000 వరకు డిస్కౌంట్‌తో పాటు, రూ. 15,000 విలువైన యాక్సెసరీస్ ఉచితంగా అందిస్తున్నారు. అలాగే, మహీంద్రా మరాజో కారు కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు రూ. 35,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది.

ఈ ఆఫర్లు ఆగస్టు నెలలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. మరిన్ని వివరాలకు మహీంద్రా డీలర్ షిప్ ను సంప్రదించండి.

Tags:    

Similar News