Safety Features : కార్లలాగే బైక్‌లలో కూడా ఈ సేఫ్టీ ఫీచర్లు.. ఇవి ఉంటేనే కొనండి

ఇవి ఉంటేనే కొనండి

Update: 2025-10-03 02:19 GMT

Safety Features : సురక్షితంగా బైక్ నడపడానికి కేవలం మంచి రైడింగ్ స్కిల్స్ ఉంటే సరిపోదు. మీ బైక్‌లో ఉన్న సేఫ్టీ ఫీచర్లు కూడా అంతే ముఖ్యం. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ, ఇప్పుడు బైక్‌లు కేవలం వేగం, లుక్స్ కోసమే కాకుండా, ప్రమాదకర పరిస్థితుల్లో మనల్ని కాపాడే అనేక ఫీచర్లతో వస్తున్నాయి. ఈ ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్ల గురించి చాలా మందికి తెలియదు. అందుకే, కొత్త బైక్ కొనేటప్పుడు లేదా నడిపేటప్పుడు మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కార్ల తరహా సేఫ్టీ ఫీచర్ల గురించి ఇప్పుడు చూద్దాం.

1. యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)

ఏబీఎస్ అనేది బైక్ సేఫ్టీలో ఒక గేమ్ ఛేంజర్ అని చెప్పవచ్చు. మీరు అకస్మాత్తుగా లేదా గట్టిగా బ్రేక్ వేసినప్పుడు, ఈ సిస్టమ్ టైర్లు లాక్ కాకుండా ఆపుతుంది. ముఖ్యంగా తడిగా లేదా ఇసుకతో కూడిన రోడ్లపై ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే టైర్లు జామ్ కాకపోవడం వల్ల బైక్ జారిపోకుండా ఉంటుంది. ఫలితంగా, రైడర్ బైక్‌పై తన కంట్రోల్ కోల్పోకుండా, ప్రమాదాన్ని చాలావరకు నివారించవచ్చు. ఇప్పుడు 125 సీసీ సామర్థ్యం ఉన్న బైకులలో కూడా ఈ ఫీచర్ వస్తోంది.

2. కాంబి-బ్రేకింగ్ సిస్టమ్ (CBS) / కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్

సీబీఎస్ ఫీచర్ సాధారణంగా 125 సీసీ వరకు ఉన్న తక్కువ కెపాసిటీ గల బైక్‌లలో ఇస్తారు. ఇందులో ముందు, వెనుక బ్రేక్‌లు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. అంటే, రైడర్ వెనుక బ్రేక్‌ను మాత్రమే వేసినప్పుడు, ఈ సిస్టమ్ ఆటోమేటిక్‌గా ముందు బ్రేక్‌ను కూడా యాక్టివేట్ చేస్తుంది. దీనివల్ల బ్రేకింగ్ ఫోర్స్ రెండు టైర్లపైనా సమానంగా పనిచేస్తుంది. ఫలితంగా, బైక్ త్వరగా ఆగుతుంది. జారిపోయే ప్రమాదం తగ్గుతుంది.

3. ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS)

ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఎక్కువగా ప్రీమియం, హై-పెర్ఫార్మెన్స్ బైక్‌లలో లభిస్తుంది. ఈ సిస్టమ్ నిరంతరం టైర్ల వేగాన్ని పర్యవేక్షిస్తుంది. ఉదాహరణకు, మీరు తడిసిన రోడ్డుపై వేగంగా యాక్సిలరేట్ చేసినప్పుడు వెనుక టైర్ స్లిప్ అయ్యే ప్రమాదం ఉంటే, వెంటనే టీసీఎస్ ఆటోమేటిక్‌గా ఇంజిన్ పవర్‌ను తగ్గిస్తుంది. దీనివల్ల టైరుకు రోడ్డుపై పట్టు (గ్రిప్) దొరుకుతుంది, బైక్ అదుపు తప్పకుండా ఉంటుంది. వేగంగా వెళ్లేటప్పుడు లేదా మలుపులు తిరిగేటప్పుడు కూడా ఈ ఫీచర్ ఎక్కువ భద్రతను ఇస్తుంది.

Tags:    

Similar News