ADAS Cars : హోండా అమేజ్ నుంచి టాటా నెక్సాన్ వరకు.. కేవలం రూ.9.15 లక్షలకే Level-2 ADAS కార్లు ఇవే
కేవలం రూ.9.15 లక్షలకే Level-2 ADAS కార్లు ఇవే
ADAS Cars : నేటి కాలంలో కారు కొనుగోలుదారులు డిజైన్, మైలేజ్ లేదా పవర్ కంటే సేఫ్టీకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ సేఫ్టీ ఫీచర్లలో అత్యంత ముఖ్యమైనది ADAS. ఈ సిస్టమ్ కారు చుట్టూ ఉన్న పరిస్థితులను గుర్తించి, అవసరమైతే బ్రేక్ వేయడం, లేన్‌లోనే ఉండేలా చేయడం, ప్రమాదం నుంచి రక్షించడం వంటి పనులను చేస్తుంది. Level-2 ADAS ఫీచర్‌తో అనేక చవకైన కార్లు ఇప్పుడు భారత మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫీచర్‌ను అందిస్తున్న 5 అత్యంత చవకైన కార్ల వివరాలు, ధరలు చూద్దాం.
1. హోండా అమేజ్
భారతదేశంలో Level-2 ADAS అందిస్తున్న అత్యంత చవకైన కారు హోండా అమేజ్. దీని ప్రారంభ ధర కేవలం రూ.9.15 లక్షలు (ఎక్స్-షోరూమ్). 1.2-లీటర్ i-VTEC ఇంజిన్, 89 బీహెచ్‌పీ పవర్ ఇస్తుంది. మైలేజ్ సుమారు లీటరుకు 18.65 కిమీ. ఇందులో కొలిజన్ ప్రివెన్షన్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఆటో హై-బీమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫ్యామిలీ కారుగా 416 లీటర్ల పెద్ద బూట్ స్పేస్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, వైర్‌లెస్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
2. టాటా నెక్సాన్
దాని 5-స్టార్ సేఫ్టీ రేటింగ్, దృఢత్వానికి పేరుగాంచిన టాటా నెక్సాన్, ఇప్పుడు Level-2 ADAS ఫీచర్‌తో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర 12.16 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీనిలో 118 బీహెచ్‌పీ ఇంజిన్, లీటరుకు 17–24 కిమీ మైలేజ్ ఇస్తుంది. ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, ఆటోనమస్ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రెడ్ డార్క్ ఎడిషన్, 10.25-అంగుళాల డ్యూయల్ స్క్రీన్, 360-డిగ్రీ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్లతో లభిస్తుంది.
3. మహీంద్రా XUV 3XO
భారత్ NCAP లో 5-స్టార్ రేటింగ్ సాధించిన మహీంద్రా XUV 3XO కూడా చవకైన ADAS కార్ల జాబితాలో ఉంది. దీని ప్రారంభ ధర రూ.12.17 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీనిలో 130 PS టర్బో పెట్రోల్ లేదా 115 బీహెచ్‌పీ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. ఇది లీటరుకు సుమారు 20 కిమీ మైలేజ్ ఇస్తుంది. ఫార్వర్డ్ కొలిజన్ మిటిగేషన్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, స్మార్ట్ పైలట్ అసిస్ట్ ఇందులో ఉన్నాయి. పనోరమిక్ సన్‌రూఫ్, ప్రీమియం హార్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగి ఉంది.
4. హోండా సిటీ
స్మూత్ రైడ్ క్వాలిటీకి ప్రసిద్ధి చెందిన హోండా సిటీ Level-2 ADAS తో వస్తుంది.దీని ప్రారంభ ధర 12.69 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీనిలో 1.5-లీటర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 120 బీహెచ్‌పీ పవర్ ఇస్తుంది. CVT గేర్‌బాక్స్‌తో లీటరుకు 18.4 కిమీ మైలేజ్ ఇస్తుంది. కొలిజన్ అవాయిడెన్స్, లేన్ అసిస్ట్, బ్లైండ్-స్పాట్ సిస్టమ్ వంటి ఫీచర్లు లాంగ్ టూర్లకు అనుకూలంగా ఉంటాయి. దీనిలో ఉన్న 506 లీటర్ల బూట్ స్పేస్, లెదర్ సీట్లు ప్రీమియం అనుభూతిని ఇస్తాయి.
5. హ్యుందాయ్ వెర్నా
ఈ జాబితాలో అత్యంత శక్తివంతమైనది (160 బీహెచ్‌పీ టర్బో ఇంజిన్) హ్యుందాయ్ వెర్నా. ప్రారంభ ధర రూ.14.35 లక్షలు (ఎక్స్-షోరూమ్).దీనికి ఉన్న టర్బో ఇంజిన్ 160 బీహెచ్‌పీ పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు 20.6 కిమీ మైలేజ్ ఇస్తుంది. ADAS ఫీచర్ల విషయానికి వస్తే బ్లైండ్-స్పాట్ మానిటరింగ్, లేన్ కీప్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిజన్ అవాయిడెన్స్ వంటి Level-2 ADAS ఫీచర్లు ఉన్నాయి. దీనిలో 528 లీటర్ల పెద్ద బూట్, బోస్ సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు, 5-స్టార్ GNCAP రేటింగ్ ఉంది.