Hero Passion Plus : స్ప్లెండర్ కంటే ఎక్కువ ఫీచర్లు..రూ.76 వేలకే బడ్జెట్ బైక్
రూ.76 వేలకే బడ్జెట్ బైక్
Hero Passion Plus : భారతీయ మార్కెట్‌లో ఎక్కువ కాలంగా తమ అద్భుతమైన మైలేజ్, సరసమైన ధరలకు పేరుగాంచినవి హీరో బైక్‌లు. మీరు కూడా హీరో స్ప్లెండర్ ప్లస్ కంటే ఎక్కువ ఫీచర్లు కావాలి, కానీ ఇంకా తక్కువ బడ్జెట్‌లోనే ఉండాలి అనుకుంటే హీరో ప్యాషన్ ప్లస్ 2025 బెస్ట్ ఆప్షన్. ఇటీవల జీఎస్‌టీ తగ్గింపు ప్రయోజనం ఈ బైక్‌కు కూడా లభించడంతో దీని ధర మరింత అందుబాటులోకి వచ్చింది. ఈ బడ్జెట్ బైక్ అందించే ఫీచర్లు, వివరాలు చూద్దాం.
హీరో ప్యాషన్ ప్లస్ 2025 కేవలం ఒకే వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఇది బడ్జెట్ సెగ్మెంట్‌లో ఉంటూనే మంచి రిఫైన్‌మెంట్, ఫీచర్లను అందిస్తోంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.76,691. ఆన్ రోడ్ ధర సుమారు రూ.91,137 (RTO, ఇన్సూరెన్స్ ఇతర ఛార్జీలతో కలిపి)వరకు ఉంటుంది. ఇందులో 97.2cc సామర్థ్యం గల BS6 ఫేజ్ 2B కంప్లైంట్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 7.9 బీహెచ్‌పీ పవర్‌ను, 8.05 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ బైక్, సిటీ ట్రాఫిక్‌లో సులభంగా పిక్-అప్ అవుతుంది. ఇది గంటకు 85కిమీ స్పీడ్ వరకు వెళ్తుంది.
ప్యాషన్ ప్లస్ అతిపెద్ద ఆకర్షణ దాని మైలేజ్. రోజువారీ ప్రయాణం చేసే వారికి ఈ బైక్ ఒక వరంలాంటిది. ఇది లీటరుకు 60–70కిమీ మధ్య మైలేజ్‌ను చాలా సులభంగా అందిస్తుంది. ఇందులో ఉన్న i3S (Idle Stop-Start) టెక్నాలజీ ట్రాఫిక్‌లో ఆగినప్పుడు ఇంజిన్‌ను ఆటోమేటిక్‌గా ఆపి, ఇంధనాన్ని ఆదా చేస్తుంది. దీని 11-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ ఒకసారి నింపితే 600 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్‌ను ఇస్తుంది. రోజూ 40–50 కి.మీ ప్రయాణించే వారికి ఇది అత్యంత పొదుపుగా ఉంటుంది.
2025 మోడల్‌లో ప్యాషన్ ప్లస్‌ను ఆకర్షణీయమైన ఫీచర్లతో అప్‌డేట్ చేశారు. LED హెడ్‌ల్యాంప్, డిజి-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, USB మొబైల్ ఛార్జింగ్ పోర్ట్, పెద్ద యూటిలిటీ బాక్స్ ఇందులో ఉన్నాయి. 117 కిలోల బరువు ఉండటం వల్ల సిటీ ట్రాఫిక్‌లో ఈజీగా నడపవచ్చు. దీనికి తోడు కంఫర్టబుల్ సీటింగ్ పొజిషన్ ఉంది. బ్లాక్ హెవీ గ్రే, బ్లాక్ గ్రే స్ట్రైప్, స్పోర్ట్ రెడ్, బ్లాక్ నెక్సస్ బ్లూ వంటి నాలుగు రంగులలో అందుబాటులో ఉంది. ఎక్కువ మైలేజ్ అప్‌డేటెడ్ ఫీచర్లు, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు ఉండే బైక్ కోసం చూస్తున్నట్లయితే హీరో ప్యాషన్ ప్లస్ ఉత్తమ ఎంపిక.