Hero : కేవలం రూ.73 వేలకే సూపర్ బైక్.. షైన్, స్ప్లెండర్‌లకు గట్టిపోటీ
షైన్, స్ప్లెండర్‌లకు గట్టిపోటీ;
Hero : భారత మార్కెట్లో హీరో మోటోకార్ప్ తన అత్యంత సరసమైన బైక్ హెచ్ఎఫ్ డీలక్స్ సరికొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. దీనికి హెచ్ఎఫ్ డీలక్స్ ప్రో అని పేరు పెట్టారు. కొత్త వేరియంట్ లుక్, ఫీచర్లలో అనేక అప్‌డేట్‌లను పొందింది. కొత్త వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.73,550 గా నిర్ణయించారు. ఈ కొత్త మోడల్ ఎంట్రీ-లెవల్ కమ్యూటర్ బైక్ సెగ్మెంట్‌లో హీరో స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. హెచ్ఎఫ్ డీలక్స్ ఇప్పటికే హీరో ప్రజాదరణ పొందిన బైక్. ఈ కొత్త మోడల్‌లో కొనుగోలుదారులు అద్భుతమైన రైడింగ్ ఎక్సపీరియన్స్, మంచి మైలేజ్, ఎక్కువ మన్నికను పొందనున్నారు. ఈ బైక్ హోండా షైన్, హీరో స్ప్లెండర్ వంటి వాటికి గట్టి పోటీనివ్వనుంది.
హెచ్ఎఫ్ డీలక్స్ ప్రో లుక్ ఇప్పుడు మరింత స్టైలిష్‌గా, ఆకర్షణీయంగా మారింది. ఇందులో కొత్త గ్రాఫిక్స్, క్రోమ్ డీటైలింగ్‌ను జోడించారు. ఈ బైక్‌లో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ ఇవ్వడం విశేషం, ఈ సెగ్మెంట్‌లోని ఏ ఇతర బైక్‌లోనూ ఈ ఫీచర్ లేదు. దీంతో పాటు, క్రౌన్-స్టైల్ పొజిషన్ ల్యాంప్, డిజిటల్ మీటర్ కూడా లభిస్తున్నాయి. ఈ డిజిటల్ మీటర్‌లో లో ఫ్యూయెల్ వార్నింగ్ వంటి సమాచారం కూడా కనిపిస్తుంది. ఈ అదనపు ఫీచర్లు బైక్‌కు ప్రీమియం లుక్‌ను ఇస్తాయి.
హెచ్ఎఫ్ డీలక్స్ ప్రో బైక్‌లో ముందు, వెనుక రెండు వైపులా 18-అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లు అమర్చారు. వెనుక భాగంలో 130 మిమీ డ్రమ్ బ్రేక్ లభిస్తుంది. వెనుక సస్పెన్షన్ 2-స్టెప్ అడ్జస్టబుల్గా ఉండటం వల్ల వివిధ రకాల రోడ్లపై కూడా బైక్ నడపడం సులభం అవుతుంది.
హెచ్ఎఫ్ డీలక్స్ ప్రోలో మిగిలిన హెచ్ఎఫ్ డీలక్స్ మోడళ్లలో లభించే అదే 97.2 సీసీ ఇంజిన్ను ఉపయోగించారు. ఈ ఇంజిన్ 8000 ఆర్‌పిఎం వద్ద 7.9 బీహెచ్‌పి పవర్‌ను, 6000 ఆర్‌పిఎం వద్ద 8.05 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హీరో i3S స్టాప్-స్టార్ట్ సిస్టమ్, లో-ఫ్రిక్షన్ ఇంజిన్, తక్కువ రోలింగ్ రెసిస్టెన్స్ ఉన్న టైర్లు దీని మైలేజ్‌ను మరింత మెరుగుపరుస్తాయి. సిటీ రోడ్ల మీద బైక్ నడపడంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాయి. హెచ్ఎఫ్ డీలక్స్ ప్రో ఇప్పుడు భారతదేశం అంతటా ఉన్న హీరో డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది.