Car Discounts: కొత్త కారు కొనేవారికి పండుగే పండుగ.. ఏకంగా రూ.2.75 లక్షల వరకు భారీ ఆదా
రూ.2.75 లక్షల వరకు భారీ ఆదా
Car Discounts: దసరా పండుగ ముగిసినప్పటికీ ఆటోమొబైల్ మార్కెట్లో డిస్కౌంట్ల పండుగ ఇంకా కొనసాగుతోంది. రాబోయే దీపావళి నాటికి కొత్త కారును ఇంటికి తీసుకెళ్లాలని భావిస్తున్న కస్టమర్ల కోసం ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు భారీ ఆఫర్లను ప్రకటించాయి. మారుతి సుజుకి, హ్యుందాయ్, కియా, రెనో, టాటా మోటార్స్, మహీంద్రా వంటి దిగ్గజ కంపెనీలు తమ పాపులర్ మోడళ్లపై క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బోనస్, కార్పొరేట్ తగ్గింపులను అందిస్తున్నాయి. కొన్ని ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలపై ఏకంగా రూ.2.75 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి.
మారుతి సుజుకి, హ్యుందాయ్, కియా కార్లపై ఆఫర్లు
దేశీయ దిగ్గజం మారుతి సుజుకి తన వ్యాగన్ఆర్ పెట్రోల్ వెర్షన్‌పై రూ.37,000, సీఎన్జీ మోడల్‌పై రూ.27,000 వరకు క్యాష్ డిస్కౌంట్ ఇస్తోంది. దీనికి తోడు రూ.15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. స్విఫ్ట్ కారుపై రూ.20,000 నగదు తగ్గింపుతో పాటు రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తోంది. విక్టోరిస్ స్ట్రాంగ్ హ్యాబ్రిడ్ మోడల్‌పై ఏకంగా రూ.31,000 క్యాష్ డిస్కౌంట్, రూ.50,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందే అవకాశం ఉంది. హ్యుందాయ్ సంస్థ తన పాపులర్ ఎస్యూవీ క్రెటాపై రూ.లక్ష వరకు, ఎక్స్టర్ పై రూ.50,000 వరకు ప్రయోజనాలు ఇస్తోంది. కియా సోనెట్‌పై రూ.1,02,700, సిరోస్పై రూ.1,60,400, సెల్టోస్‌పై రూ.1,47,100 వరకు మొత్తం ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.
రెనో కార్లపై ధమాకా డిస్కౌంట్లు
ఫ్రెంచ్ కార్ తయారీ సంస్థ రెనో తన ఎంట్రీ లెవెల్ కారు క్విడ్‌పై రూ.15,000 క్యాష్ డిస్కౌంట్, రూ.25,000 స్క్రాపేజ్ బోనస్ ఇస్తోంది. ఏడు సీట్ల ట్రైబర్ కారుపై రూ.50,000 వరకు సేవింగ్స్ పొందే వెసులుబాటు ఉంది. కొన్ని వేరియంట్లపై మూడేళ్ల ఉచిత మెయింటెనెన్స్ ప్యాకేజీ కూడా ఇస్తున్నారు. కైగర్ కారుపై రూ.50,000 వరకు, రెనో డస్టర్ హెవీ మోడళ్లపై ఏకంగా రూ.1.5 లక్షల నుండి రూ.2 లక్షల వరకు భారీ తగ్గింపులు ప్రకటించారు. పాత రెనో కారును మార్చుకునే వారికి అదనంగా రూ.10,000 లాయల్టీ బోనస్ లభిస్తుంది.
టాటా ఈవీలు, మహీంద్రా ఎస్‌యూవీలపై భారీ ప్యాకేజీలు
టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ వాహనాలపై అత్యధిక డిస్కౌంట్లను ఇస్తోంది. టియాగో ఈవీ లాంగ్ రేంజ్ మోడల్‌పై రూ.1.45 లక్షలు, పంచ్ ఈవీ లాంగ్ రేంజ్ వెర్షన్‌పై రూ.1.45 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ మోడల్‌పై రూ.55,000, హ్యారియర్, సఫారి పెట్రోల్-డీజిల్ వేరియంట్లపై రూ.45,000 వరకు ఆఫర్లు ఉన్నాయి. మరోవైపు మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్వోపై రూ.60,000, స్కోర్పియో క్లాసిక్‌పై రూ.45,000 వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. స్కోర్పియో-ఎన్ Z8L ఫోర్-వీల్ డ్రైవ్ మోడల్‌పై ఏకంగా రూ.1.5 లక్షల వరకు తగ్గింపును కంపెనీ అందిస్తోంది.