Maruti Grand Vitara : ఫుల్ ట్యాంక్‌తో 1200 కి.మీ.ల రేంజ్.. ఈ హైబ్రిడ్ కారుపై ఏకంగా రూ.1.54 లక్షలు తగ్గింపు
ఈ హైబ్రిడ్ కారుపై ఏకంగా రూ.1.54 లక్షలు తగ్గింపు;
Maruti Grand Vitara : భారతీయ మార్కెట్‌లో అత్యధిక కార్లను విక్రయించే కంపెనీలలో మారుతి ఒకటి. మారుతి ప్రీమియం ఎస్‌యూవీ గ్రాండ్ విటారాను కొనాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఇదే మంచి ఛాన్స్. ఈ నెలలో కంపెనీ ఈ కారుపై ఏకంగా రూ.1.54 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ కారులోని అన్ని వేరియంట్‌లకు వర్తిస్తుంది. ముఖ్యంగా, స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్‌పైన కూడా భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. మారుతి గ్రాండ్ విటారా హైబ్రిడ్ సిగ్మా, డెల్టా, జెటా , ఆల్ఫా వేరియంట్‌లతో పాటు ఆల్ వీల్ డ్రైవ్ మోడల్‌పైన కూడా డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ధర రూ.11.42 లక్షల నుండి రూ.20.68 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే 1200 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.
మారుతి గ్రాండ్ విటారా పెట్రోల్ సిగ్మా వేరియంట్‌పై ప్రస్తుతం ఎటువంటి క్యాష్ డిస్కౌంట్ లేదు. కానీ, దీనిపై రూ.84,100 వరకు ఇతర ప్రయోజనాలు లభిస్తున్నాయి. అన్ని వేరియంట్లపై రూ.40,000 క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. దీనికి తోడు రూ.84,100 వరకు ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విధంగా, అన్ని వేరియంట్లపై మీరు మొత్తం రూ.1.24 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.
పెట్రోల్ ఏడబ్ల్యూడీ వేరియంట్‌పై రూ.35,000 క్యాష్ డిస్కౌంట్, రూ.84,100 వరకు ఇతర ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఈ వేరియంట్‌పై మొత్తం ప్రయోజనాలు రూ.1.19 లక్షల వరకు ఉన్నాయి. ఈ నెలలో అత్యధిక డిస్కౌంట్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్‌పై లభిస్తుంది. దీనిపై రూ.50,000 క్యాష్ డిస్కౌంట్, అలాగే రూ.1.04 లక్షల వరకు ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విధంగా, మొత్తం ప్రయోజనాలు రూ.1.54 లక్షల వరకు ఉన్నాయి.
గ్రాండ్ విటారా సీఎన్‌జీ వేరియంట్‌పై రూ.10,000 క్యాష్ డిస్కౌంట్, రూ.39,100 వరకు ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. ఈ వేరియంట్‌పై మొత్తం ప్రయోజనాలు రూ.49,100 వరకు ఉన్నాయి. మారుతి, టయోటా సంయుక్తంగా హైరైడర్, గ్రాండ్ విటారాను తయారు చేశాయి. హైరైడర్ మాదిరిగానే గ్రాండ్ విటారాలో మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్ ఉంది. ఇది 1462 సీసీ K15 ఇంజిన్‌తో వస్తుంది, ఇది 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 100 bhp పవర్, 4400 ఆర్‌పిఎమ్ వద్ద 135 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. మైలేజ్ విషయానికి వస్తే, స్ట్రాంగ్ హైబ్రిడ్ e-CVT మోడల్ లీటరుకు 27.97కిమీ మైల్డ్ హైబ్రిడ్ 5-స్పీడ్ ఎమ్‌టీ లీటరుకు 21.11కిమీ, మైల్డ్ హైబ్రిడ్ 6-స్పీడ్ ఏటీ లీటరుకు 20.58 కిమీ మైలేజీని ఇస్తుంది.
మారుతి గ్రాండ్ విటారా హైబ్రిడ్‌లో అనేక అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 360-డిగ్రీ వ్యూ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ పార్కింగ్ కెమెరా, రియర్ రిఫ్లెక్టర్, రీజనరేటివ్ బ్రేకింగ్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, పవర్ అడ్జస్టబుల్ ఎక్స్‌టీరియర్ రియర్ వ్యూ మిర్రర్, షార్క్ ఫిన్ యాంటెన్నా, రియర్ సీట్ యూఎస్‌బీ, సీ-టైప్ ఛార్జింగ్ అవుట్‌లెట్, 60-40 స్ప్లిట్ రియర్ సీట్, క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వంటి ఫీచర్లు లభిస్తాయి.