Hyundai : తక్కువ ధరకే క్రెటా మజా.. కొత్త లుక్‌లో వస్తున్న హ్యుందాయ్ వెన్యూ ఎస్యూవీ

కొత్త లుక్‌లో వస్తున్న హ్యుందాయ్ వెన్యూ ఎస్యూవీ

Update: 2025-10-07 04:21 GMT

Hyundai : హ్యుందాయ్ తన పాపులర్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ వెన్యూ కొత్త వెర్షన్‌ను త్వరలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఆటోకార్ ఇండియా నివేదిక ప్రకారం.. నవంబర్ 4న భారతదేశంలో తన నెక్స్ట్ జనరేషన్ వెన్యూను విడుదల చేయడానికి హ్యుందాయ్ సన్నాహాలు చేస్తోంది. కొత్త వెన్యూ ఉత్పత్తి మహారాష్ట్రలోని కంపెనీకి చెందిన కొత్త తలేగావ్ ప్లాంట్‌లో ప్రారంభమైంది.

హ్యుందాయ్ ఈ కొత్త వెన్యూకు QU2i అనే కోడ్‌నేమ్ ఇచ్చింది. ఇది పూర్తిగా కొత్త డిజైన్‌తో రావడం ఒక ప్రత్యేకత. మునుపటి మోడల్‌తో పోలిస్తే ఇందులో ఎక్కువ ఫీచర్లు, లేటెస్ట్ టెక్నాలజీ, ఇంటీరియర్‌లో పెద్ద మార్పులు ఉంటాయని అంచనా. కొత్త వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో టాటా నెక్సాన్, మారుతి బ్రెజా, మహీంద్రా XUV 3XO, కియా సోనెట్ వంటి కార్లతో పోటీ పడుతుంది.

కొత్త వెన్యూలో చాలా కొత్తదనం ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఉన్న మోడల్ ప్లాట్‌ఫారమ్‌నే ఉపయోగించవచ్చని అంచనా. ఇంజిన్ విషయంలో కూడా పాత ఎంపికలే లభించే అవకాశం ఉంది. ఇందులో 1.2-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఎంపికలు లభిస్తాయి. ఇవి మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో వస్తాయి.

కొన్ని మీడియా నివేదికల ప్రకారం, హ్యుందాయ్ స్పోర్టీ N లైన్ వెర్షన్‌ను కూడా అందిస్తూనే ఉంటుంది, ఇది స్టాండర్డ్ మోడల్ విడుదలైన కొద్దికాలానికే రావచ్చు. స్టైలింగ్ విషయంలో కొత్త వెన్యూ హ్యుందాయ్ పెద్ద ఎస్‌యూవీ క్రెటా నుండి స్ఫూర్తి పొంది ఉంటుంది. దీని ఫ్రంట్ డిజైన్ ఇప్పుడు చాలా బోల్డ్, షార్ప్‎గా ఉంటుంది.

ఇందులో క్వాడ్ LED హెడ్‌ల్యాంప్స్, L-ఆకారపు DRLలు, బోనెట్‌పై విస్తరించిన కనెక్టెడ్ లైట్ బార్ ఉంటాయి. ఇవి రెక్టాంగ్యులర్ స్లాట్‌లతో కూడిన పెద్ద పారామెట్రిక్ గ్రిల్‌తో వస్తాయి. ఈ డిజైన్ ఇప్పుడు హ్యుందాయ్ గ్లోబల్ ఎస్‌యూవీలలో సాధారణం అయింది. ఇంటీరియర్ విషయానికి వస్తే, పూర్తిగా కొత్త డాష్‌బోర్డ్ డిజైన్, ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంటేషన్ కోసం డ్యూయల్-స్క్రీన్ లేఅవుట్, మెరుగైన మెటీరియల్స్ , ఫినిష్ ఉంటాయని అంచనా. టెక్నాలజీ విషయానికి వస్తే, కొత్త వెన్యూలో ADAS వంటి సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయని అంచనా.

దీనితో పాటు పెద్ద టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు, అంబియెంట్ లైటింగ్, హ్యుందాయ్ బ్లూలింక్ కనెక్టెడ్ సూట్ వంటి ఫీచర్లు కూడా ఉంటాయి. మొత్తంమీద, ఫినిషింగ్, ఫిట్-ఫినిష్‎లో గణనీయమైన మెరుగుదల ఉంటుందని అంచనా. మే 2019లో విడుదలైనప్పటి నుండి వెన్యూ హ్యుందాయ్ అత్యంత విజయవంతమైన కార్లలో ఒకటిగా ఉంది. ఇది దాని మొదటి కాంపాక్ట్ ఎస్‌యూవీ, క్రెటా తర్వాత అత్యధికంగా అమ్ముడైన రెండవ మోడల్‌గా నిలిచింది.

Tags:    

Similar News