Honda : హీరో స్ప్లెండర్‌కు షాక్.. సరికొత్త హోండా షైన్ 100 DX వచ్చేసింది

సరికొత్త హోండా షైన్ 100 DX వచ్చేసింది;

Update: 2025-07-24 04:26 GMT

Honda : దేశీయ టూ-వీలర్ మార్కెట్‌లో సంచలనం సృష్టించడానికి హోండా రెడీ అయింది. తన పాపులర్ పొందిన బైక్ షైన్ 100 సరికొత్త, ప్రీమియం వెర్షన్ అయిన హోండా షైన్ 100 DXను భారతదేశంలో విడుదల చేసింది. ఈ బైక్ ఇప్పుడు కేవలం లేటెస్టుగా కనిపించడమే కాకుండా, ఫీచర్లు, డిజైన్‌లో స్టాండర్డ్ షైన్ 100 కంటే మెరుగ్గా ఉంది. దీని బుకింగ్స్ ఆగస్టు 1, 2025 నుండి ప్రారంభం కానున్నాయి

హోండా షైన్ 100 DX లో ఇప్పుడు మునుపటి కంటే వెడల్పాటి ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు. ఇది బైక్‌కు మరింత మస్కులర్, భారీ రూపాన్ని ఇస్తుంది. దీనికి అదనంగా బోల్డ్ గ్రాఫిక్స్, క్రోమ్ హెడ్‌లైట్ కౌల్, క్రోమ్ హీట్ షీల్డ్ వంటివి బైక్‌కు ప్రీమియం ఫీలింగ్‌ను అందిస్తాయి. రోడ్లపై వెళ్తుంటే అందరి దృష్టిని ఆకర్షించేలా దీని డిజైన్ ఉంది. షైన్ 100 DX లో ఒక కొత్త ఎల్‌సిడి డిజిటల్ క్లస్టర్‎ను అమర్చారు. ఈ సెగ్మెంట్‌లో ఇది ఒక పెద్ద అప్‌డేట్‌గా చెప్పవచ్చు. దీనితో బైక్ ఇప్పుడు మరింత అడ్వాన్సుడ్‎గా, టెక్-ఫ్రెండ్లీగా కనిపిస్తుంది. రైడర్‌కు అవసరమైన సమాచారం స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ బైక్‌ను యువతను దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేశారు. హోండా షైన్ 100 DX ఇప్పుడు 4 ఆకర్షణీయమైన రంగులలో అందుబాటులో ఉంది. అవి: పెర్ల్ ఇంగేనియస్ బ్లాక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, అథ్లెటిక్ బ్లూ మెటాలిక్, జెనీ గ్రే మెటాలిక్. హోండా షైన్ 100 DX లో అదే పవర్ ఫుల్ 98.98సీసీ ఇంజిన్ లభిస్తుంది. ఈ ఇంజిన్ 7.28 బీహెచ్‌పీ పవర్‌ను, 8.04 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 4-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అందించారు.

ఈ బైక్‌లో స్టీల్ ఫ్రేమ్ ఛాసిస్ ఉంది. దీంతో పాటు, ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, వెనుక భాగంలో 5-స్టెప్ అడ్జస్టబుల్ రియర్ షాక్స్ అమర్చారు. ఇది 17-అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లతో కూడిన అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది. ఇది స్టైల్, సేఫ్టీని రెండింటినీ పెంచుతుంది. దీని బుకింగ్స్ ఆగస్టు 1 నుండి మొదలవుతాయి.

Tags:    

Similar News