Honda : హోండా నుంచి తొలి ఎలక్ట్రిక్ బైక్.. ఫుల్ ఛార్జ్ చేస్తే ఎన్ని కి.మీ వెళ్తుందంటే!
ఫుల్ ఛార్జ్ చేస్తే ఎన్ని కి.మీ వెళ్తుందంటే!
Honda : ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన హోండా చివరకు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ రంగంలో అడుగుపెట్టింది. కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ హోండా WN7ను యూరోప్‌లో ఆవిష్కరించింది. ఈ బైక్‌లో W అంటే గాలి అని అర్థం. ఇది బైక్ డిజైన్‌ను స్పష్టంగా చూపిస్తుంది. N అంటే నెక్డ్, ఇది దాని ఓపెన్ స్ట్రీట్ ఫైటర్ లుక్‌ను సూచిస్తుంది. 7 దాని అవుట్‌పుట్ కేటగిరీని సూచిస్తుంది.
మిలన్‌లో జరిగిన EICMA 2024లో ప్రదర్శించిన ఈవీ ఫన్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించిన WN7, మోటార్‌సైకిళ్ల ఫన్ సెగ్మెంట్లో హోండా తొలి అడుగు. ఇది ఫిక్స్‌డ్ లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 130 కి.మీ.ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. దీని అతి పెద్ద ప్రత్యేకత దాని ఛార్జింగ్ కెపాసిటీ. CCS2తో ఇది ఫాస్ట్ ఛార్జర్‌పై కేవలం 30 నిమిషాల్లో 20 శాతం నుండి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఇంట్లో పూర్తిగా ఛార్జ్ చేయడానికి మూడు గంటల కంటే తక్కువ సమయం పడుతుంది.
పవర్ పరంగా కొత్త WN7 మోటార్‌సైకిల్ 600సీసీ ఇంజిన్ ఉన్న పెట్రోల్ మోటార్‌సైకిళ్లకు సమానంగా ఉంటుందని హోండా పేర్కొంది. టార్క్ పరంగా ఇది 1000సీసీ బైక్‌లతో పోటీ పడగలదు. ఆన్-డిమాండ్ యాక్సిలరేషన్‌తో, దీని స్మూత్, సైలెంట్ పనితీరు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లపై ఉన్న అంచనాలను పూర్తిగా మార్చవచ్చు.
WN7 ఎలక్ట్రిక్ వెహికల్ లుక్‌ను అద్భుతంగా ఉంది. దీని డిజైన్ హోండా ప్రస్తుత ఐసీఈ (ICE) లైనప్‌లోని బైకులకు డిఫరెంటుగా ఉంటుంది. డాష్‌బోర్డ్ మధ్యలో 5-అంగుళాల టీఎఫ్‌టీ స్క్రీన్ ఉంది, ఇందులో హోండా రోడ్‌సింక్ ద్వారా స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్ ఉంది. ఇది ప్రయాణంలో నావిగేషన్, మ్యూజిక్, కాల్ నోటిఫికేషన్‌లను అందిస్తుంది. WN7 కేవలం ఒక మోడల్ విడుదల మాత్రమే కాదని కంపెనీ పేర్కొంది. హోండా 2040 నాటికి తన అన్ని మోటార్‌బైక్‌లను కార్బన్-న్యూట్రలైజ్ చేయాలని వాగ్దానం చేసింది. 2050 నాటికి పూర్తి కార్బన్ న్యూట్రలైజేషన్‌ను సాధించడమే కంపెనీ లక్ష్యం.