Driving License : ఇంట్లో కూర్చోనే ఇలా కేవలం 2నిమిషాల్లో ఆన్‌లైన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ డౌన్‌లోడ్ చేస్కోండి

ఆన్‌లైన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ డౌన్‌లోడ్ చేస్కోండి

Update: 2025-10-06 06:49 GMT

Driving License : ఈ రోజుల్లో ప్రతి పనికీ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అంతా డిజిటల్ మయం అయిపోయింది. మీ డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియ పూర్తయి, మీరు ఇంకా హార్డ్ కాపీ కోసం ఎదురుచూస్తుంటే, ఇంట్లో కూర్చొనే ఆన్‌లైన్‌లో దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రభుత్వం డిజిలాకర్, mParivahan App వంటి ప్లాట్‌ఫారమ్‌లను తీసుకురావడం ద్వారా రవాణా సేవలను డిజిటలైజ్ చేసింది. ఈ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను చాలా సులభంగా పొందవచ్చు.

డ్రైవింగ్ లైసెన్స్ డౌన్‌లోడ్ చేసే విధానాలు

1. పరివాహన్ సేవా పోర్టల్ ద్వారా డౌన్‌లోడ్

* మొదటగా, మీ మొబైల్ లేదా ల్యాప్‌టాప్ బ్రౌజర్‌లో https://sarathi.parivahan.gov.in అనే వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.

* వెబ్‌సైట్ ఓపెన్ అయ్యాక, ఎడమ వైపు ఉన్న Online Services ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

* ఆ తర్వాత Driving Licence Related Services ఆప్షన్‌ను ఎంచుకుని, మీ రాష్ట్రం పేరును సెలెక్ట్ చేయండి.

* కొత్త విండోలో కిందకు స్క్రోల్ చేసి Print Driving Licence పై క్లిక్ చేయండి.

* ఇప్పుడు మీరు మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాలి.

* Submit చేయగానే, మీ లైసెన్స్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దాన్ని మీరు PDF ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

2. డిజిలాకర్ వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్

* ప్రభుత్వ గుర్తింపు పొందిన డిజిలాకర్ ద్వారా కూడా మీ లైసెన్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

* ముందుగా https://www.digilocker.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.

* మీ మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీ ఉపయోగించి లాగిన్/సైన్ ఇన్ అవ్వాలి.

* సెర్చ్ బార్‌లో Driving Licence అని టైప్ చేయండి.

* Ministry of Road Transport and Highways ఆప్షన్‌ను ఎంచుకోండి.

* మీ లైసెన్స్ నంబర్‌ను నమోదు చేసి Get Document పై క్లిక్ చేయండి.

* మీ డ్రైవింగ్ లైసెన్స్ వెంటనే డౌన్‌లోడ్ అయ్యి PDF రూపంలో సేవ్ అవుతుంది.

3. డిజిటల్ లైసెన్స్ వల్ల ప్రయోజనాలు

డ్రైవింగ్ లైసెన్స్‌కు చట్టపరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఉంటేనే మీరు రోడ్డుపై వాహనాన్ని సురక్షితంగా నడపవచ్చు. ప్రమాదం జరిగినప్పుడు లేదా వాహన బీమా క్లెయిమ్ చేసేటప్పుడు ఇది తప్పనిసరి పత్రంగా ఉంటుంది. ఇక డిజిటల్ లైసెన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, మీ మొబైల్‌లో దీన్ని ఎప్పుడూ ఉంచుకోవచ్చు. దీనివల్ల మీ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది.

Tags:    

Similar News