Hyundai Venue : ఈ సారి అదిరిపోయే ఫీచర్లతో దీపావళికి మార్కెట్లోకి కొత్త వెన్యూ
దీపావళికి మార్కెట్లోకి కొత్త వెన్యూ;
Hyundai Venue : జూలై 2025 అమ్మకాల్లో మహీంద్రాను వెనక్కి నెట్టి హ్యుందాయ్ రెండో స్థానాన్ని తిరిగి దక్కించుకుంది. ఇప్పుడు కంపెనీ సంవత్సరంలో అతిపెద్ద లాంచ్‌కు సిద్ధమవుతోంది. ఆ లాంచ్ మరేదో కాదు, కొత్త తరం హ్యుందాయ్ వెన్యూ. ఈ దీపావళికి ఈ కొత్త వెన్యూ మార్కెట్‌లోకి రాబోతోంది. టెస్టింగ్ సమయంలో చాలాసార్లు భారతీయ రోడ్లపై కనిపించిన ఈ కొత్త వెన్యూ, ఈసారి కొత్త డిజైన్, మరిన్ని ఫీచర్లు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో లాంచ్ కానుంది. అయితే, కారు పవర్‌ట్రైన్‌లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు.
కొత్త వెన్యూ డిజైన్ మరింత అడ్వాన్సుడ్, బోల్డ్‌గా ఉండబోతోంది. మొదటిసారిగా ఇందులో క్వాడ్-ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, కనెక్టెడ్ డీఆర్ఎల్ లు ఇవ్వనున్నారు. ఇవి ప్రస్తుతం ఉన్న క్రెటా నుంచి స్ఫూర్తి పొంది ఉంటారని భావిస్తున్నారు. హెడ్‌ల్యాంప్ కింద ఎల్-షేప్‌లో ఉన్న ఎల్ఈడీ లైట్లు ఉంటాయి. అలాగే ఈ ఎస్‌యూవీకి కొత్త డిజైన్ 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, మందపాటి వీల్ ఆర్చ్ క్లాడింగ్, ఫ్లాట్ విండో లైన్, పొడవైన రేర్ స్పాయిలర్ వంటి కొత్త స్టైలింగ్ డిజైన్‌లు ఇవ్వబడ్డాయి. ఈ మార్పుల వల్ల వెన్యూ మునుపటి కంటే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
ఫీచర్ల విషయానికొస్తే, కొత్త వెన్యూ మరింత హైటెక్ కానుంది. ఇందులో లెవెల్-2 ఎడీఏఎస్ టెక్నాలజీ, నాలుగు డిస్క్ బ్రేక్‌లు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లను అందించనున్నారు. ప్రస్తుతం ఉన్న వెన్యూలో కేవలం లెవెల్-1 ఎడీఏఎస్ మాత్రమే ఉంది. క్యాబిన్ వివరాలు ఇంకా వెల్లడి కాలేదు కానీ, క్రెటా, అల్కాజార్ నుంచి కొన్ని ఫీచర్‌లను దీనిలోకి తీసుకోవచ్చని అంచనా వేస్తున్నారు. పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది.
పవర్‌ట్రైన్ విషయానికొస్తే, ఇందులో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. కొత్త వెన్యూలో అదే 1.2L-పెట్రోల్ ఇంజిన్ కొనసాగుతుంది. దానితో పాటు, 1.0L-టర్బో పెట్రోల్ ఇంజిన్ కూడా ఎప్పటిలాగే లభిస్తుంది. అలాగే 1.5L-డీజిల్ ఇంజిన్ కూడా యథాతథంగా ఉంటుంది. ఈ ఇంజిన్‌లు మంచి పర్ఫార్మెన్స్‌ను, మైలేజ్‌ను అందిస్తాయి. ఈ కొత్త వెన్యూ ధర ప్రస్తుత మోడల్ కంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.