MG Windsor EV :400 రోజుల్లో 50,000 అమ్మకాలు.. రోజుకు 125 మంది కొంటున్న కారు.. టాటా, మహీంద్రాకు షాక్!
రోజుకు 125 మంది కొంటున్న కారు.. టాటా, మహీంద్రాకు షాక్!
MG Windsor EV : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో ఎంజీ విండ్సర్ ఈవీ అద్భుతమైన రికార్డు సృష్టించింది. ఈ కారు లాంచ్ అయిన కేవలం 400 రోజుల్లోనే 50,000 యూనిట్లను అమ్మేసింది. అంటే రోజుకు సగటున 125 మంది ఈ కారును కొంటున్నారు. దీంతో ఈ కారు దేశంలోనే అత్యంత వేగంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారుగా నిలిచి, టాటా, మహీంద్రా వంటి వాటికి గట్టి పోటీ ఇస్తోంది. ఎంజీ కంపెనీ ఇటీవల విండ్సర్ ఈవీ ప్రో అనే కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. ఇందులో ఎక్కువ రేంజ్ లభిస్తుంది. స్టాండర్డ్ మోడల్‌లో 332 కి.మీ రేంజ్ ఇచ్చే 38kWh బ్యాటరీ ఉంటుంది. కానీ ఈ ప్రో మోడల్‌లో 52.9kWh బ్యాటరీ ఉంది. కాబట్టి ఇది ఏకంగా 449 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. రేంజ్ పెరిగినా, కారు పవర్ (136hp), టార్క్ (200 Nm) మాత్రం పాత విధంగానే ఉన్నాయి.
ఛార్జింగ్ విషయానికి వస్తే 7.4kW AC ఛార్జర్‌తో బ్యాటరీ పూర్తిగా నిండడానికి సుమారు 9.5 గంటలు పడుతుంది. అయితే 60kW DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కేవలం 50 నిమిషాల్లోనే 20% నుంచి 80% వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. డిజైన్‌లో పెద్ద మార్పులు లేకపోయినా కొత్తగా 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, ముందు, వెనుక కనెక్ట్ అయిన LED లైట్‌బార్ వంటి చిన్న అప్‌డేట్‌లు చేశారు. అలాగే ఈ కారు మూడు కొత్త కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
కారు లోపలి భాగంలో (ఇంటీరియర్) కూడా మార్పులు జరిగాయి. పాత మోడల్‌లోని నలుపు రంగు ఇంటీరియర్‌కు బదులుగా కొత్త ప్రో మోడల్‌లో బేజ్ (లేత గోధుమ రంగు) థీమ్ ఉపయోగించారు. ముఖ్యంగా ఇందులో V2V (కారు నుంచి కారుకు) అనే కొత్త టెక్నాలజీలు ఉన్నాయి. దీని ద్వారా ఈ కారు మరో ఎలక్ట్రిక్ కారును ఛార్జ్ చేయగలదు. అలాగే ఇంట్లో వాడే డివైజ్‌లకు కూడా పవర్‌ను అందించగలదు. దీంతో పాటు, లెవెల్ 2 ADAS వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.