Kia: కియా షోరూమ్‌కు వెళ్లే ముందు అలర్ట్.. పలు వేరియంట్లు బంద్ చేసిన కంపెనీ
| బంద్ చేసిన కంపెనీ
Kia: భారత మార్కెట్లో అత్యధికంగా కార్లు విక్రయించే సంస్థల్లో కియా ఒకటి. ప్రస్తుతం ఈ కంపెనీ సోనెట్, సైరోస్, కారెన్స్ క్లావిస్, సెల్టోస్ లాంటి పాపులర్ కార్లను అమ్ముతోంది. అయితే తాజాగా కియా తన పాపులర్ మోడళ్లయిన సెల్టోస్, కారెన్స్ క్లావిస్, సోనెట్ కార్ల వేరియంట్ జాబితాను ప్రక్షాళన చేస్తూ పలు ట్రిమ్‌లను మార్కెట్ నుంచి తొలగించింది. దీనిపై కంపెనీ అధికారికంగా కారణం చెప్పకపోయినా, కియా ఇండియా వెబ్‌సైట్‌లో ఈ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తక్కువ డిమాండ్ ఉన్న వేరియంట్లను తీసేసి, కస్టమర్లకు కారు ఎంపికను సులభతరం చేయడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు.
సెల్టోస్‌లో 1.5L టర్బో iMT, నాన్-ADAS ఎక్స్‌లైన్ బంద్
ముందుగా కియా సెల్టోస్ విషయానికి వస్తే.. ఇందులో 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే అన్ని iMT గేర్‌బాక్స్ వేరియంట్లను కంపెనీ పూర్తిగా నిలిపివేసింది. గతంలో ఈ కాంబినేషన్ HTE (O) కన్వీనియన్స్ ప్యాక్, HTK, HTK (O) ప్రీమియం ప్యాక్ ట్రిమ్‌లలో దొరికేది. ఇప్పుడు ఈ మూడు వేరియంట్లు జాబితా నుంచి తొలగిపోయాయి. ఇకపై 1.5L టర్బో పెట్రోల్ ఇంజిన్ కొనాలనుకునే వారికి కేవలం 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్ ఆప్షన్ మాత్రమే మిగిలింది. దీనితో పాటు ADAS లేని స్టాండర్డ్ X Line వేరియంట్లను (NA పెట్రోల్, టర్బో పెట్రోల్, టర్బో డీజిల్) కూడా కంపెనీ బంద్ చేసింది.
కారెన్స్ క్లావిస్‌లో బేస్ డీజిల్, చీపెస్ట్ ADAS మోడల్ ఔట్
సెల్టోస్ మాదిరిగా కాకుండా కారెన్స్ క్లావిస్లో 1.5L టర్బో iMT గేర్‌బాక్స్‌ను పూర్తిగా తీసేయలేదు. కేవలం HTX టర్బో పెట్రోల్ iMT వేరియంట్‌ను మాత్రమే నిలిపివేశారు. అంటే ఇకపై ఈ ఇంజిన్-గేర్‌బాక్స్ కాంబినేషన్ కేవలం HTX+ ట్రిమ్‌లో మాత్రమే దొరుకుతుంది. మరోవైపు డీజిల్ విభాగంలో బేస్ మోడల్ అయిన HTE 1.5L డీజిల్ MT వేరియంట్‌ను తొలగించారు. దీంతో ఇకపై డీజిల్ లైనప్ HTE (O) ట్రిమ్ నుంచి మొదలవుతుంది. అలాగే ఈ ఏడాది మార్చిలో తీసుకొచ్చిన 1.5L టర్బో పెట్రోల్ DCT HTX (O) A వేరియంట్‌ను కూడా నిలిపివేశారు. క్లావిస్‌లో అత్యంత తక్కువ ధరకే లభించే ADAS మోడల్ ఇదే కావడం గమనార్హం.
సోనెట్‌లో రెండు టర్బో iMT ట్రిమ్‌లకు కత్తెర
కియా సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ సోనెట్లోనూ ప్రధాన మార్పు 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ iMT గేర్‌బాక్స్‌లోనే జరిగింది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న HTK+ టర్బో పెట్రోల్ iMT, HTX టర్బో పెట్రోల్ iMT వేరియంట్లను కంపెనీ తొలగించింది. ఈ మార్పు తర్వాత సోనెట్‌లో 1.0L టర్బో పెట్రోల్ iMT ఆప్షన్ కేవలం HTK (O), HTK+ (O) ట్రిమ్‌లకు మాత్రమే పరిమితమైంది.
కొత్త లిస్ట్ చెక్ చేసుకోండి
ఒకవేళ మీరు ఈ నెలలో కియా సెల్టోస్, సోనెట్ లేదా కారెన్స్ క్లావిస్ కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, పాత బ్రోచర్ల ఆధారంగా వెళ్లకండి. కంపెనీ వెబ్‌సైట్ లేదా దగ్గరలోని డీలర్‌షిప్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొత్త వేరియంట్లు, ఫీచర్లు, ధరల వివరాలను ఒకసారి సరిచూసుకోవడం మంచిది. అనవసరమైన గందరగోళం తగ్గించి, ఎక్కువ డిమాండ్ ఉన్న మోడళ్లపై దృష్టి పెట్టేందుకే కియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆటో రంగ నిపుణులు చెబుతున్నారు.