Kinetic DX : ఈ స్కూటర్ కొంటే 9 ఏళ్లు నో టెన్షన్.. కేవలం రూ. 1,000కే బుకింగ్

కేవలం రూ. 1,000కే బుకింగ్;

Update: 2025-07-29 08:54 GMT

Kinetic DX : భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీ కైనెటిక్ గ్రీన్ మార్కెట్‌లోకి కొత్త ఇ-స్కూటర్ కైనెటిక్ DXని లాంచ్ చేసింది. ఈ స్కూటర్‌పై 3 ఏళ్లు లేదా 30,000 కి.మీ. వారంటీ వస్తుంది. దీన్ని ఏకంగా 9 ఏళ్లు లేదా లక్ష కి.మీ. వరకు పొడిగించుకోవచ్చు. అంటే, 9 ఏళ్ల పాటు టెన్షన్ లేకుండా స్కూటర్‌ను వాడుకోవచ్చు. ఇది DX, DX+ అనే రెండు మోడల్స్‌లో అందుబాటులో ఉంది. ఈ కొత్త ఇ-స్కూటర్ ధర రూ.1.12 లక్షల నుంచి రూ.1.18 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది బ్లాక్, బ్లూ, సిల్వర్, వైట్, రెడ్ వంటి 5 రంగులలో లభిస్తుంది. ఈ స్కూటర్ బుకింగ్‌లు జులై 28 నుంచే మొదలయ్యాయి. కేవలం రూ.1,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. అయితే, కంపెనీ కేవలం 40,000 యూనిట్లను మాత్రమే తయారు చేయనున్నట్లు తెలిపింది.

కైనెటిక్ DX అనేది ఒక పాత బ్రాండ్ పేరు. 1984లో కైనెటిక్ మొదటిసారిగా DX స్కూటర్‌ను లాంచ్ చేసింది. అది 2007 వరకు అమ్ముడైంది. ఇప్పుడు అదే పేరుతో పూర్తిగా ఎలక్ట్రిక్ మోడల్‌ను తీసుకొచ్చింది. ఇదివరకు 'లూనా'ను కూడా ఎలక్ట్రిక్ వెర్షన్‌లో తిరిగి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఇ-స్కూటర్‌లో 4.8kW BLDC ఎలక్ట్రిక్ మోటార్, 2.6kWh LFP బ్యాటరీ ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 116 కి.మీ. దూరం వెళ్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 90 కి.మీ. రేంజ్, పవర్, టర్బో అనే మూడు రైడ్ మోడ్స్, రివర్స్ మోడ్ కూడా ఉన్నాయి. క్రూజ్ కంట్రోల్, 8.8-అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ స్పీకర్, కీ లెస్ సిస్టమ్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగే, చార్జర్‌ను స్కూటర్ బాడీలోనే సర్దుకునే ఈజీ ఛార్జ్ సిస్టమ్ ఉండడం దీని ప్రత్యేకత.

Tags:    

Similar News