Electric Cars : సింగిల్ ఛార్జ్ తో వందల కిలోమీటర్లు ప్రయాణించే ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. సేఫ్టీలోనూ ఇవి తోపు
సేఫ్టీలోనూ ఇవి తోపు;
Electric Cars : ఈ ఏడాది ఆటోమొబైల్ కంపెనీలు ఇప్పటికే చాలా కొత్త ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చాయి. ఈ ఏడాది రెండవ భాగంలో కూడా మరిన్ని కొత్త ఈవీలు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ కొత్త కార్లు వచ్చేలోపు ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎక్కువ దూరం ప్రయాణించగల కెపాసిటీ ఉన్న కొన్ని బెస్ట్ ఎలక్ట్రిక్ కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
1. మహింద్రా బీఈ6
మహింద్రా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును గతేడాది నవంబర్‌లో ఆవిష్కరించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బుకింగ్స్ మొదలయ్యాయి. ఏప్రిల్ నుంచి డెలివరీలు కూడా ప్రారంభమయ్యాయి. మీరు కూడా ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకుంటే ఈ కారు 59kWh, 79kWh అనే రెండు బ్యాటరీ ఆప్షన్స్‌లో లభిస్తుంది. ఒకే ఛార్జ్‌తో ఈ కారు 557 కిలోమీటర్ల నుంచి 682 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఈ కారు ధర రూ.18.90 లక్షల నుంచి రూ.26.90 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. BNCAP క్రాష్ టెస్ట్‌లో మహింద్రా బీఈ6 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది.
2. టాటా హారియర్ ఈవీ
దేశంలోనే అత్యంత సురక్షితమైన కార్లను తయారు చేసే టాటా మోటార్స్ నుంచి వచ్చిన ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ధర రూ.21.49 లక్షల నుంచి రూ.28.99 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఈ కారు 65kWh, 75kWh అనే రెండు బ్యాటరీ ఆప్షన్స్‌లో లభిస్తుంది. ఈ రెండు వేరియంట్లు వరుసగా 538 కిలోమీటర్లు, 627 కిలోమీటర్ల రేంజ్ ఇస్తాయి. ఈ కారు 75kWh AWD వేరియంట్ ఒకే ఛార్జ్‌తో 622 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. BNCAP క్రాష్ టెస్ట్‌లో టాటా హారియర్ ఈవీ కూడా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది.
3. 2025 కియా ఈవీ6
ఈ ఏడాది మొదట్లో ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కొత్త రూపంలో లాంచ్ చేశారు. ఈ కారు ధర రూ.65.97 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది సింగిల్ జీటీ లైన్ AWD వేరియంట్‌లో లభిస్తుంది. ఇందులో 84kWh బ్యాటరీ ఉంటుంది. ఇది ఒకే ఛార్జ్‌తో 650 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది. ఈ కారులో మరిన్ని కొత్త ఫీచర్లు, టెక్నాలజీలు, మెరుగైన డిజైన్ లభిస్తాయి.