Mahindra XUV 3XO : డాల్బీ అట్మాస్ ఆడియోతో కొత్త ఎస్‌యూవీ.. ధర కేవలం రూ.8.94లక్షలే

ధర కేవలం రూ.8.94లక్షలే;

Update: 2025-08-22 10:32 GMT

Mahindra XUV 3XO : భారత మార్కెట్లో ఎస్‌యూవీలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా సరికొత్త ఎస్‌యూవీని విడుదల చేసింది. మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్ఓ ప్రపంచంలోనే రూ.12 లక్షల లోపు ధరలో డాల్బీ అట్మాస్ ఆడియో టెక్నాలజీని అందించిన మొట్టమొదటి ఎస్‌యూవీగా నిలిచింది. ఈ అడ్వాన్సుడ్ ఆడియో ఫీచర్ ప్రత్యేకంగా కొత్తగా విడుదలైన REVX A, AX5L, AX7, AX7L వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ ఆడియో సెటప్‌లో సబ్‌ వూఫర్‎తో పాటు 6-స్పీకర్ల ఆడియో సిస్టమ్ ఉంది. ఇది బెస్ట్ సౌండ్ అనుభూతిని అందిస్తుంది.

డాల్బీ అట్మాస్ ఆడియో టెక్నాలజీతో వచ్చిన ఈ నాలుగు కొత్త వేరియంట్ల డెలివరీలు సెప్టెంబర్ 2025 మధ్యలో ప్రారంభం కానున్నాయి. మహీంద్రా బీఈ 6, ఎక్స్​ఈవీ 9ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు, థార్ రాక్స్ తర్వాత డాల్బీ అట్మాస్‌ను అందించిన నాలుగో వెహికల్ సిరీసుగా ఎక్స్​యూవీ 3ఎక్స్ఓ నిలిచింది. మహీంద్రా ఆటోమోటివ్ బిజినెస్ ప్రెసిడెంట్ ఆర్.వేలుసామి మాట్లాడుతూ.. "రూ.12 లక్షల లోపు ధరలో డాల్బీ అట్మాస్ వంటి ప్రీమియం ఫీచర్‌ను అందించడం మాకు గర్వకారణం. ఈ ఫీచర్ ద్వారా నేటి ఎస్‌యూవీ కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం" అని తెలిపారు.

మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్రస్తుత ధరల శ్రేణి రూ.7.99 లక్షల నుంచి రూ.15.80 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది. కొత్తగా వచ్చిన REVX A, AX5L, AX7, AX7L వేరియంట్ల ధరలు వరుసగా రూ.8.94 లక్షలు, రూ.12.62 లక్షలు, రూ.12.79 లక్షలు మరియు రూ.13.99 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.

ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ మూడు ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్. ఇది 117 బీహెచ్​పీ పవర్ ఉత్పత్తి చేస్తుంది. 1.2 లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇది 131 బీహెచ్​పీ పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఇంకోటి 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇది 111 బీహెచ్​పీ పవర్ ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఉన్నాయి. ఈ అడ్వాన్సుడ్ ఇంజిన్, టెక్నాలజీ ఫీచర్ల కలయికతో ఎక్స్​యూవీ 3ఎక్స్ఓ మార్కెట్లో తనదైన ముద్ర వేయనుంది.

Tags:    

Similar News