Mahindra Vs Tata : మహీంద్రా వర్సెస్ టాటా..అసలైన కురుక్షేత్రం షురూ..XUV 7XO ముందు సఫారీ నిలుస్తుందా?

అసలైన కురుక్షేత్రం షురూ..XUV 7XO ముందు సఫారీ నిలుస్తుందా?

Update: 2026-01-09 13:16 GMT

Mahindra Vs Tata : భారతీయ రోడ్లపై కింగ్ ఎవరు? అని అడిగితే వినిపించే రెండు పేర్లు మహీంద్రా, టాటా. ప్రస్తుతం మార్కెట్లో మహీంద్రా XUV 7XO, టాటా సఫారీ మధ్య అసలైన యుద్ధం మొదలైంది. ప్రీమియం లుక్, అదిరిపోయే పవర్, అత్యాధునిక ఫీచర్లతో వచ్చిన ఈ రెండు ఎస్‌యూవీలలో ఏది బెస్ట్? ఏ కారు టాప్ వేరియంట్‌లో ఎక్కువ ఫీచర్లు ఉన్నాయి? అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఈ రెండింటి మధ్య ఉన్న పోలికలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం.

ధర విషయానికి వస్తే.. మహీంద్రా XUV 7XO బేస్ పెట్రోల్ వేరియంట్ రూ. 13.66 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. దీని టాప్-ఎండ్ AX7L డీజిల్ మాన్యువల్ వేరియంట్ ధర రూ.24.92 లక్షల వరకు ఉంది. మరోవైపు టాటా సఫారీ పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.13.29 లక్షలుగా ఉంది. ధరల పరంగా చూస్తే రెండూ దాదాపు ఒకే స్థాయిలో ఉన్నట్లు కనిపిస్తున్నా, ఫీచర్ల పరంగా మహీంద్రా కాస్త ముందంజలో ఉంది.

డిజైన్, ఇంటీరియర్: మహీంద్రా XUV 7XO సరికొత్త డిజైన్ ఫిలాసఫీతో వచ్చింది. ముఖ్యంగా లోపల ట్రిపుల్-స్క్రీన్ డాష్‌బోర్డ్ దీనికి ఒక ఫ్యూచరిస్టిక్ లుక్ ఇస్తుంది. పనోరమిక్ సన్‌రూఫ్, ప్రీమియం కేబిన్ దీని సొంతం. ఇక టాటా సఫారీ విషయానికి వస్తే, ఇది తన పాత రాజసాన్ని కొనసాగిస్తూనే ఆధునిక హంగులను అద్దుకుంది. దీని లోపల పెద్ద టచ్‌స్క్రీన్, ప్రీమియం అప్హోల్స్టరీ ఆకట్టుకుంటాయి. రెండూ కూడా 6 మరియు 7 సీటర్ ఆప్షన్లలో లభిస్తాయి.

ఇంజిన్, పర్ఫార్మెన్స్: పర్ఫార్మెన్స్ విషయంలో మహీంద్రా ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. XUV 7XOలో 197 bhp ఇచ్చే 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 182 bhp ఇచ్చే 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి. దీనికి అదనంగా ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ ఉండటం పెద్ద ప్లస్. టాటా సఫారీలో 168 bhp ఇచ్చే 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో పాటు, కొత్తగా 1.5 లీటర్ హైపేరియన్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కూడా పరిచయం చేశారు. ఇది 170 PS పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, సఫారీలో AWD ఆప్షన్ లేకపోవడం ఒక లోటు.

ఫీచర్ల యుద్ధం: రెండు కార్లలోనూ లెవల్ 2 ADAS, 360-డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి కామన్ ఫీచర్లు ఉన్నాయి. కానీ మహీంద్రా XUV 7XOలో 540-డిగ్రీ కెమెరా (కారు కింద భాగం కూడా కనిపిస్తుంది), ప్యాసింజర్ డిస్ప్లే, 7-సీట్ వేరియంట్లలో సెకండ్ రో సీట్లకు కూడా వెంటిలేషన్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. టాటా సఫారీ అప్ కమింగ్ అకాంప్లిష్డ్ అల్ట్రా ట్రిమ్‌లో మరిన్ని ఫీచర్లు వస్తున్నప్పటికీ, ధర పరంగా చూస్తే XUV 7XOనే ఎక్కువ వాల్యూ ఫర్ మనీగా కనిపిస్తోంది.

Tags:    

Similar News